తమిళనాడులో(tamilnadu) సరికొత్త రాజకీయ సమీకరణాలు జరగబోతున్నాయా?

తమిళనాడులో(tamilnadu) సరికొత్త రాజకీయ సమీకరణాలు జరగబోతున్నాయా? ఇండియా కూటమిలో(INDIA Alliance) ఉన్న డీఎంకే(DMK) నెమ్మదిగా బీజేపీ(BJP) వైపు అడుగులు వేస్తున్నదా? అసలు ఈ చర్చ ఎందుకు వచ్చింది? డీఎంకే వ్యవస్థాపకుడు ఎం. కరుణానిధి(M Karunanidhi) శత జయంతి ఉత్సవాలు తమిళనాడు అంతగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌(Rajnath singh) హాజరయ్యారు. కరుణానిధిపై ఆయన ప్రశంసల జల్లు కురిపించారు. నిజానికి ఆ కార్యక్రమం అలాంటిది! తప్పనిసరిగా నాలుగు మంచిమాటలే చెప్పాల్సి ఉంటుంది. కానీ కరుణానిధి గురించి రాజ్‌నాథ్‌ సింగ్‌ చాలా గొప్పగా చెప్పడమే అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(MK Stalin) కూడా ఆశ్చర్యపోయారు. ఆ మాటకొస్తే డీఎంకే నేతలు కూడా పొగడని విధంగా రాజ్‌నాథ్‌ తమ అధినేతను ప్రశంసించారని స్టాలిన్‌ పేర్కొన్నారు. అయితే రాజ్‌నాథ్‌ ప్రసంగంతో తమిళనాడులో కొత్తచర్చ మొదలయ్యింది. డీఎంకే, బీజేపీ మధ్య కొత్త పొత్తులకు ఇది మొదటి మెట్టు కావచ్చని ఊహిస్తున్నారు. బీజేపీతో స్టాలిన్‌ పొత్తు పెట్టుకుంటారని, ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్‌తో(Congress) ఉన్న స్నేహాన్ని వదిలేస్తారని కొందరు అంటున్నారు. బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లోనూ డీఎంకే పొత్తు పెట్టుకోదని, తమ బంధం దృఢమైనదని కాంగ్రెస్‌ నాయకులు అంటున్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తమ చెలిమి ఇలాగే కొనసాగుతుందని చెబుతున్నారు.

Eha Tv

Eha Tv

Next Story