తన పెళ్లిపై వస్తున్న వార్తలపై స్టార్ హీరోయిన్ శృతిహాసన్ (Shruthi Hasan) స్పందించింది. తన బాయ్‌ఫ్రెండ్ శాంతను హజారికను (Shanthanu Hazarikanu)రహస్యంగా పెళ్లి (Marriage) చేసుకున్నట్లు వస్తున్న వదంతులపై ఆమె స్పష్టత ఇచ్చింది.

shruthi-compressed
తన పెళ్లిపై వస్తున్న వార్తలపై స్టార్ హీరోయిన్ శృతిహాసన్ (Shruthi Hasan) స్పందించింది. తన బాయ్‌ఫ్రెండ్ శాంతను హజారికను (Shanthanu Hazarikanu)రహస్యంగా పెళ్లి (Marriage) చేసుకున్నట్లు వస్తున్న వదంతులపై ఆమె స్పష్టత ఇచ్చింది. నేను హజారికాను పెళ్లి చేసుకోలేదు. ఒకవేళ పెళ్లి చేసుకుంటే తప్పకుడా అందరికీ చెప్తా. ప్రతీ విషయాన్ని అందరితో షేర్ చేసుకునే నేను పెళ్లి విషయాన్ని ఎలా దాచిపెడతానని ట్వీట్ (Tweet) చేసింది. ఇకనైనా ఈ అవాస్తవాన్ని దుష్ప్రచారం చేయకండి అని ఆమె కోరింది. మరోవైపు హజారికా కూడా మేము పెళ్లి చేసుకోలేదని దయచేసి ఇలాంటి వదంతులు ఆపాలని ఆపాలని శాంతను హజారికా కూడా పోస్ట్ చేశాడు.
సినిమాల విషయానికొస్తే.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన శైలిలో నటిస్తూ టాలీవుడ్‌లో శృతి హాసన్ స్టార్ హీరోయిన్ పేరుగావించింది. ఆ మధ్య వ్యక్తిగత కారణాల వల్ల సినిమాలకు దూరంగా ఉన్నా టాలీవుడ్‌లో సెకండ్ ఇన్నింగ్స్‌తో దూసుకుపోతుంది. 2023లో తెలుగులో వరుస సక్సెస్‌లను అందుకుంది శృతి హాసన్. సంక్రాంతికి విడుదలైన చిరంజీవి (Chiranjeevi) వాల్తేర్ వీరయ్య (Waltair Veerayya), బాలకృష్ణ (Balakrishna) వీరసింహారెడ్డి (Veera shimha Reddy) సినిమాలతో బ్లాక్‌బస్టర్ హిట్స్‌ను సంపాదించుకుంది. హీకొ నాని 'హాయ్ నాన్న' సినిమాలో శృతిహాసన్ కీలక పాత్రలో నటించింది. డిసెంబర్ 22న విడుదలైన ప్రభాస్ (Prabhas) సలార్ (Salar) పాన్ ఇండియా మూవీలో నటించి మరో హిట్‌ను శృతిహాసన్ అందుకుంది.
