నిత్యానంద స్వామి(Nityanand Swamy) అంటేనే ఓ వివాదాస్పదం.

నిత్యానంద స్వామి(Nityanand Swamy) అంటేనే ఓ వివాదాస్పదం. భారత్ లో కిడ్నాప్(Kidnap),అత్యాచారం(Sexual assault) వంటి పలు ఆరోపణలు ఎదుర్కొంటూ 2019లో దేశం విడిచి పరారైన వివాదాస్పద ఆధ్యాత్మికవేత్త నిత్యానంద స్వామి 'యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస'(United states of Kailas) పేరుతో ఓ దేశాన్ని ఏర్పాటు చేసుకున్న మనకు తెలిసిందే. దీనికి పౌరసత్వం కూడా జారీ ప్రత్యేక కరెన్సీ కూడా రూపొందించారన్న వార్తలు చాలా కాలంగా వింటున్నాం. కైలస దేశం ఎక్కడ ఉందనేది ఇప్పటికీ మిస్టరీగానే మారింది. నిత్యానంద చెప్పే కైలాస దేశం ఎక్కడుందో ఆ కైలాసవాసికి కూడా తెలియదు. తమకు ప్రత్యేక దేశం, ప్రత్యేక జెండా, ప్రత్యేక కరెన్సీ ఉందని ప్రకటించారు. ఈ దేశానికి తానే ప్రధానిని అని కూడా ప్రకటించుకున్నాడు.

గతంలో కైలాస దేశం తరుపున ఐక్యరాజ్య సమితి సమావేశంలో మహిళా రాయబారులు పాల్గొన్న విషయం తెలిసిందే. కైలాసకు చెందిన ప్రతినిధి ఐక్యరాజస్య సమితి నిర్వహించిన ఒక సదస్సులో ప్రత్యేక ఆకర్షణ దుస్తులతోను..ఆహార్యంతోను పాల్గొన్న ఫోటోలో తెగ వైరల్ అయ్యాయి. ఆ సమావేశంలో కైలాస దేశ రాయబారిగా వచ్చిన ప్రియా నిత్యానంద మాట్లాడుతూ భారతదేశం నిత్యానందను వేధిస్తోందని ఆరోపించారు కూడా. కానీ ఐక్యరాజ్య సమితి మాత్రం ఆమె ఆరోపణలను పరిగణలోకి తీసుకోలేదు. పైగా యూఎన్ ను ప్రియా నిత్యానంద ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో పాల్గొన్న విషయంపై మీడియా ప్రశ్నించగా ఇది కేవలం ఒక సాధారణ సమావేశం అధికారిక సమావేశం కాదని ఇందులో ఎవరైనా మాట్లాడవచ్చని ప్రియా నిత్యానంద వ్యాఖ్యలను తాము పరిగణలోకి తీసుకోవట్లేదని స్పష్టత ఇచ్చారు.

గతంలో కైలాస దేశం ఎక్కడుందో చెప్పకుండా కేవలం యూట్యూబ్‌ చానెల్లోనే నిత్యానంద వీడియోలు చేసేవారు. అయితే తాజాగా జులై 21న కైలాస దేశం వివవరాలను వెల్లడిస్తానని నిత్యానంద ప్రకటించారు. ఈ మేరకు తనవెబ్‌సైట్‌లో ఓ ప్రకటన విడుదల చేశారు. కైలాస దేశం తెరుచుకుంది. కైలాస దేశంలో చేరండని ఓ లింక్‌ కూడా ఇచ్చారు.21న గురుపౌర్ణమి రోజు కైలాస దేశం ఎక్కడుందో చెప్తామని ప్రకటిచారు. దీంతో కైలాస దేశంపై సోషల్‌ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. సమయంలోనే సీన్‌లోకి మరో మిస్టరీ క్యారెక్టర్‌ బయటకు వచ్చింది. తాను ఎవరో కాదు ఒకప్పటి నిత్యానంద ప్రియ శిశ్యురాలు సారా స్టెఫానీ లాండ్రీ. కైలాస దేశాన్ని రివీల్‌ చేస్తానని నిత్యానంద ప్రకటిస్తానని చెప్పగానే ఈమె బయటకొచ్చింది. ప్రస్తుతం కెనడాలో నివసిస్తున్నారు సారా స్టెఫానీ లాండ్రీ. 2009లో నిత్యానంద ఆశ్రమంలో చేరానని 9 ఏళ్ల పాటు అక్కడే ఉన్నానని.. తనకు 24 ఏళ్లు ఉన్నప్పుడు అక్కడ చేరి 33 ఏళ్ల వయసున్నప్పుడు అక్కడి నుంచి బయటకొచ్చానని ఆమె అన్నారు. 2009లో నిత్యానంద రాసలీలల వీడియో బయటపడినప్పుడు నిత్యానందను సారా స్టెఫానీ డిఫెన్స్‌ చేసింది. ఎవరో మార్ఫింగ్ చేసి నిత్యానందపై కుట్రలు పన్నారని ఆ సమయంలో సారా లాండ్రి వెనకేసుకొచ్చింది. ఆ తర్వాత నిత్యానంద గురించి నిజాలు తెలిశాక ఆశ్రమం నుంచి వెళ్లిపోయినట్లు ఆమె ప్రకటించారు. చిన్నారులను హత్య చేయడం, మహిళలపై అత్యాచారాలు చేసేవాడని నిత్యానంద గురించి తెలియడం అక్కడి నుంచి బయటపడినట్లు ఆమె అన్నారు.

అయితే సారా లాండ్రి మరోసారి బయటకొచ్చారు. నిత్యానంద రివీల్ చేస్తానన్న కైలాస దేశం అనేది ఓ కట్టుకథ అని ఆమె చెప్పుకొచ్చారు. 2009లో కేసులకు భయపడి భారత్‌ నుంచి పారిపోయిన నిత్యానంద ఈక్వెడార్‌లో ఉండేవాడని ఆమె అన్నారు. కైలాస దేశం జెండా, పాస్‌పోర్టు, కరెన్సీవంటి వన్నీ తన లాంటివారు ఫేక్‌గా తయారు చేసినవేనని ఆమె అంటోంది. ఇదే తరహాలో జులై 21న కూడా ఓ ఫేక్‌ వీడియోను ప్రపంచానికి చూపిస్తారని సారా లాండ్రి ఆరోపిస్తోంది. మరోవైపు కేలాస దేశంలో నమోదు చేసుకోవాలని ఆన్‌లింక్‌ సైతం ఇచ్చారు. అయితే వీరిద్దరిలో ఏది నిజమో తెలియాలంటే ఈనెల 21 వరకు ఆగాల్సిందేనని తెలుస్తోంది. నిజానికి గత కొంత కాలంగా కైలాస దేశంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. 2023లో ఐరాస సమావేశాల్లో కైలాస ప్రతినిధులుగా కొంత మంది నిత్యానంద శిశ్యులు వచ్చారు. ఆ సమయంలో తాము కైలాస దేశ ప్రతినిధులమని చెప్పుకున్నారు. ఈనెల 21న కైలాస దేశ రివీల్‌పై ఇప్పుడంతా ఆసక్తి నెలకొంది.

Eha Tv

Eha Tv

Next Story