నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) నాయకుడు, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీని(Baba Siddique) ముగ్గురు నిందితులు కాల్చి చంపారు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) నాయకుడు, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీని(Baba Siddique) ముగ్గురు నిందితులు కాల్చి చంపారు. ముంబాయిలోని(Mumbai) బాంద్రా ఈస్ట్ ప్రాంతంలో హత్య చేశారు. వీరిలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాము లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు(Lawrence Bishnoi gang) చెందిన వారమని పోలీసుల విచారణలో వారు తెలిపారట! అరెస్టయిన ఇద్దరు నిందితుల పేర్లు కర్నైల్ సింగ్, ధరమ్‌రాజ్ కశ్యప్ అని పోలీసులు తెలిపారు. వీరిలో కర్నైల్ సింగ్ హర్యానా నివాసి కాగా, ధర్మరాజ్ కశ్యప్ ఉత్తరప్రదేశ్‌లో ఉంటాడు. నిందితులు గత పాతిక 30 రోజుల నుంచి ఆ ప్రాంతంలో రెక్కీ చేశారట! ముగ్గురు నిందితులు ఆటో రిక్షాలో బాంద్రా దగ్గరకు వచ్చారు. బాబా సిద్ధిఖీపై కాల్పులు జరపడానికి ముందు, ఆ ముగ్గురూ కొంతసేపు అక్కడ ఎదురుచూశారని పోలీసులు తెలిపారు. బాబా సిద్ధిఖీపై కాల్పులు జరిపేందుకు నిందితులు 9.9 ఎంఎం పిస్టల్‌ను ఉపయోగించారు. దుండగులు మొత్తం ఆరు రౌండ్లు కాల్పులు జరిపితే, అందులో నాలుగు బుల్లెట్లు బాబా సిద్ధిఖీకి తగిలాయి. హత్యకు గల కారణాలు ఇంకా తెలియదు. పరారైన మూడో నిందితుని కోసం పోలీసులు వెతుకుతున్నారు. .