చక్కెరలాగే ఉప్పు (Salt)కూడా మహా డేంజరట! రోజుకు అయిదు గ్రాముల కంటే ఎక్కువ ఉప్పును వాడితే ఆరోగ్యానికి విపరీతమైన నష్టం చేకూరుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) అంటోంది. శరీరంలోని కీలక అవయవాలు దెబ్బతింటాయని, ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 19 లక్షల మంది చనిపోతున్నారని తెలిపింది. రక్తపోటు(Blood Pressure), గుండె సమస్యలు(Heart Problems), క్యాన్సర్(Cancer), స్థూలకాయం, కిడ్నీకి సంబంధించిన వ్యాధులు వస్తాయని చెప్పింది.
చక్కెరలాగే ఉప్పు (Salt)కూడా మహా డేంజరట! రోజుకు అయిదు గ్రాముల కంటే ఎక్కువ ఉప్పును వాడితే ఆరోగ్యానికి విపరీతమైన నష్టం చేకూరుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) అంటోంది. శరీరంలోని కీలక అవయవాలు దెబ్బతింటాయని, ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 19 లక్షల మంది చనిపోతున్నారని తెలిపింది. రక్తపోటు(Blood Pressure), గుండె సమస్యలు(Heart Problems), క్యాన్సర్(Cancer), స్థూలకాయం, కిడ్నీకి సంబంధించిన వ్యాధులు వస్తాయని చెప్పింది. శరీరానికి సోడియం(Sodium) అవసరమే అయినప్పటికీ రోజుకు రెండువేల మిల్లీ గ్రాముల కంటే ఎక్కువ తీసుకోకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరించింది. అయిదు గ్రామాల ఉప్పు లేదా ఒక టేబుల్ స్పూన్‌లో సోడియం రెండు వేల మిల్లీ గ్రాముల వరకు ఉంటుంది. వంటల్లో ఉప్పు అనివార్యం. ఉప్పు లేకపోతే ఏదీ రుచిగా ఉండదు. కానీ మోతాదు మించితే ప్రమాదమే! అందుకే ఉప్పు వాడకం నుంచి క్రమంగా బయటపడాలి. ఉప్పుకు బదులుగా నిమ్మరసం(Lemon juice), వెనిగర్(Veniger), వోమ, నానబెట్టిన సబ్జ గింజలు వాడవచ్చని డబ్ల్యుహెచ్‌వో చెబుతోంది. అలాగే ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోకూడదని పేర్కొంది.