భారతీయ వంటలలో వెల్లుల్లి(Garlic)కి ప్రత్యేక స్థానం ఉంది. వంటకాలలో దీన్ని చేర్చిస్తే అదనపు రుచి వస్తుంది.

భారతీయ వంటలలో వెల్లుల్లి(Garlic)కి ప్రత్యేక స్థానం ఉంది. వంటకాలలో దీన్ని చేర్చిస్తే అదనపు రుచి వస్తుంది. వెల్లుల్లికి అల్లం తోడైతే ఇక చెప్పనే అక్కర్లేదు. మన వంటింట్లో ఓ భాగమైన వెల్లుల్లి మీద ఎప్పుడైనా ఏదైనా డౌట్‌ వచ్చిందా? అదేనండి అది కూరగాయనా? లేక మసాలా దినుసా? అన్న సందేహం వచ్చే ఉంటుంది కదా! అప్పట్లో దీనిపై చర్చోప చర్చలు జరిగాయి. చివరకు కోర్టు వరకు వెళ్లింది. న్యాయస్థానం వరకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అసలు ఏం జరిగింది? అంటే

మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లో వెల్లుల్లి కూరగాయా? లేక సుగంధ ద్రవ్యమా అన్న డౌటానుమానం వచ్చేసింది. ఈ వివాదాన్ని ఈ మధ్యనే మధ్యప్రదేశ్‌ హైకోర్టు (Madhya Pradesh High Court)పరిష్కరించింది. వెల్లుల్లిని సుగంధ ద్రవ్యంగా వర్గీకరించంది. అసలు 1972 వ్యవసాయోత్పత్తి మార్కెట్ కమిటీ చట్టం కారణంగా ఈ వివాదం మొదలయ్యింది. వెల్లుల్లి నిర్దిష్ట మార్కెట్‌లలోనే అమ్మకాలు సాగేవి, ఇది రైతులకు పెద్ద సమస్యగా మారింది. వ్యవసాయ మార్కెట్లలో అమ్ముకునే వీలు లేకుండా పోవడంతో రైతులు బాగా నష్టపోయేవారు. దీంతో 2007లో మాంద్‌సౌర్‌కు చెందిన ఓ వెల్లుల్లి వ్యాపారి ఈ వర్గీకరణను సవాల్ చేస్తూ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్లో వెల్లుల్లిని అమ్ముకోవడానికి అనుమతి కోరారు. పోటాలో ఆనియన్‌ కమిషన్‌ అసోసియేషన్ నుంచి వ్యతిరేకత ఉన్నా మండి బోర్డు మొదట్లో వెల్లుల్లి అమ్మకానికి కొంత వెసులుబాటు ఇచ్చింది. ఎప్పుడైతే వ్యవసాయ మార్కెట్లలో మాత్రమే వెల్లుల్లి విక్రయించాలని మధ్యప్రదేశ్ ప్రధాన కార్యదర్శి ఆదేశించారో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో వ్యాపారులు హైకోర్టుకు వెళ్లారు. న్యాయస్థానం రైతులకు అనుకూలంగా తీర్పునిచ్చింది. వెల్లులిని ఏ మార్కెట్‌లో అయినా అమ్ముకునేందుకు అనుమతిచ్చింది. ఈ నిర్ణయాన్ని హైకోర్టు డబుల్ బెంచ్ సమర్థించింది. పొటాటో ఆనియన్ కమీషన్ అసోసియేషన్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను కూడా ధర్మాసనం తోసిపుచ్చింది. వ్యవసాయ లేదా కూరగాయల మార్కెట్‌లలో వెల్లుల్లిని అమ్ముకోవడానికి వెసులుబాటు కల్పించింది.

ehatv

ehatv

Next Story