నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) వ్యవస్థాపకుడు శరద్ పవార్ కుటుంబంలో వాతావరణం అంతా బాగాలేదని ఊహాగానాలు ఎక్కువయ్యాయి. శరద్ పవార్ అన్న కొడుకు అజిత్ పవార్ బీజేపీలో చేరనున్నారనే ప్రచారం జరుగుతోంది. మహావికాస్ అఘాడీలో భాగమైన శివసేన (ఉద్ధవ్ వర్గం) ఈ పుకార్లకు ఆజ్యం పోస్తున్నట్లు కనిపిస్తోందనే వాదన కూడా ఉంది.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(Nationalist Congress Party) (ఎన్సీపీ) వ్యవస్థాపకుడు శరద్ పవార్(Sharad Pawar) కుటుంబంలో వాతావరణం అంతా బాగాలేదని ఊహాగానాలు ఎక్కువయ్యాయి. శరద్ పవార్ అన్న కొడుకు అజిత్ పవార్(Ajith Pawar) బీజేపీలో చేరనున్నారనే ప్రచారం జరుగుతోంది. మహావికాస్ అఘాడీలో భాగమైన శివసేన(Shivsena) (ఉద్ధవ్ వర్గం) ఈ పుకార్లకు ఆజ్యం పోస్తున్నట్లు కనిపిస్తోందనే వాదన కూడా ఉంది. శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే గత వారం భేటీ అయ్యారు. అనంతరం ఉద్ధవ్ వర్గం అధికార ప్రతినిధి సంజయ్ రౌత్(Sanjay Raut) మాట్లాడుతూ.. తమ పార్టీ నుండి ఎవరైనా బీజేపీలో చేరినా.. తాము(ఎన్సీపీ) బీజేపీ(BJP)తో వెళ్లమని ఉద్ధవ్(Uddav Thackrey)కు పవార్ హామీ ఇచ్చారని అన్నారు.
శివసేనకు చెందిన పత్రిక సామ్నా(Samna)లో సంజయ్ రౌత్.. అజిత్ పవార్‌ను 'ఎవరో' అంటూ ప్రస్తావించాడు. ఈ కథనం వల్లనే అజిత్ పవార్ డిఫెన్స్ లో పడి.. చనిపోయే వరకు ఎన్సీపీలోనే కొనసాగుతానని ప్రకటన చేయాల్సి వచ్చింది. అలాగే.. ఎన్సీపీ కి బయటి అధికార ప్రతినిధులు అవసరం లేదని సంజయ్ రౌత్‌పై విరుచుకుపడ్డారు. అజిత్ పవార్ ప్రకటనతో సంజయ్ రౌత్.. తన కథనం వల్లనే ఎన్సీపీలో 'ఆపరేషన్ లోటస్' విజయవంతం కాలేదని మరోసారి ఇచ్చాడు. నేను ఏది రాసినా కరెక్ట్‌గా రాస్తానని రౌత్ అన్నారు. నేను ఎవరి తండ్రికి భయపడనన్నారు.
సంజయ్ రౌత్ ప్రకటనపై అజిత్ పవార్‌ను అడగగా.. స్పందించడానికి నిరాకరించారు. తిరస్కార ధోరణిలో సంజయ్ రౌత్ ఎవరు? అని ప్రశ్నించారు. అజిత్ పవార్.. సంజయ్ రౌత్ వ్యాఖ్యలపై కోపంగా ఉన్నట్లు స్పష్టంటా తెలుస్తోంది. మహావికాస్ అఘాడి(Maha Vikas Aghadi)లో భాగంగా అజిత్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే తరచుగా ఒకే వేదికపై కనిపించేవారు. అయితే వారిద్దరి మధ్య చాలాకాలంగా గ్యాప్ వచ్చింది. అజిత్ పవార్ పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్న ఉద్ధవ్.. గతంలో మాట్లాడుతూ.. మహారాష్ట్రకు మహిళా ముఖ్యమంత్రి కావాలని అన్నారు. మాములుగా పవార్ కుటుంబంలో జాతీయ రాజకీయాలను సుప్రియా సూలే, రాష్ట్ర రాజకీయాలను మేనల్లుడు అజిత్ పవార్ చూసుకుంటారు. ఉద్ధవ్ ప్రకటన పట్ల అజిత్ పవార్ కొన్నిరోజులుగా అసంతృప్తితో ఉన్నారు.
ఇదిలావుంటే.. శుక్రవారం ఓ టీవీ ఛానెల్ సంభాషణలో అజిత్ పవార్ మాట్లాడుతూ.. ఉప ముఖ్యమంత్రి పదవిపై ఎన్సీపీకి ప్రస్తుతం ఆసక్తి లేదని అన్నారు. 2024లోపు ఎన్సీపీ కూడా రాష్ట్రంలో ముఖ్యమంత్రిని చేయగలదన్నారు. శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే(Supriya Sule) కూడా ఇటీవల మాట్లాడుతూ.. మహా రాజకీయాలు ఆసక్తికర చర్చకు దారి తీశాయి. వచ్చే పదిహేను రోజుల్లో రెండు పెద్ద రాజకీయ కుదుపులకు వేదిక కానుందని వ్యాఖ్యానించారు. ఢిల్లీ స్థాయిలో, మహారాష్ట్రలో రెండు కుదుపులు ఉండనున్నాయని ఆమె పేర్కొన్నారు. అవేంటని ప్రశ్నించగా.. దాటవేత సమాధానం ఇచ్చారు. కుదుపు అజిత్ పవార్ పార్టీ మారడం గురించేనా అని అడగ్గా.. ఆ విషయాన్ని అజిత్ దాదానే అడగాలని రిపోర్టర్లకు సూచించారు. ప్రజాప్రతినిధిగా తనకు చాలా పని ఉందని.. ఉత్తినే మాట్లాడేందుకు తనకు సమయం లేదన్నారు.
ఓ ప్రముఖ పత్రికలో.. అజిత్ పవార్ మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్నారు. బీజేపీ మద్దతుతో ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) వారసునిగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు కథనం తెలిపింది. ఎన్‌సీపీ ఎమ్మెల్యేల మద్దతును ఆయన కూడగడుతున్నారని తెలిపింది. ఎన్‌సీపీకి ప్రస్తుతం 53 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. వీరిలో సుమారు 40 మంది అజిత్ పవార్ వైపు ఉన్నట్లు.. వీరందరూ సంతకాలు చేసిన మద్దతు లేఖను సమయం వచ్చినపుడు గవర్నర్‌కు సమర్పించాలని నిర్ణయించారని ఆ కథనం తెలిపింది. ఓ పక్క అజిత్ పవార్, సుప్రియ ప్రకటనలు, ఉద్ధవ్ శివసేన వర్గంతో పాటు పలు పత్రికా కథనాలు.. ఇవన్నీ గమనిస్తున్న మహారాష్ట్ర ప్రజలు.. మళ్లీ ఇక్కడి రాజకీయాలు ఏ మలుపు తీసుకుంటాయోనని భావిస్తున్నారు.