IRCTC ఇది భారతీయ రైల్వేల అనుబంధ సంస్థ. భారతదేశం మొత్తంలో ఎక్కడికైనా ట్రిప్ వేయాలనుకుంటున్న వారి కోసం తక్కువ ధరలలో అనేక ప్రయాణ ప్రణాళికలను ప్రవేశపెడుతోంది. కేవలం ఇండియా మాత్రమే కాకుండా నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, దుబాయ్ కూడా రైలు, విమానాల ద్వారా ట్రిప్స్ అందిస్తోంది. ఎప్పటికప్పుడు సరికొత్త ప్యాకేజీలను అందించే ఈ IRCTC ప్రజలను ఇప్పుడు మూడు గమ్యస్థానాలకు తీసుకెళ్ళే 5 రోజుల రైలు ప్రయాణ ప్యాకేజీని ప్రవేశపెట్టింది.
IRCTC ఇది భారతీయ రైల్వేల అనుబంధ సంస్థ. భారతదేశం మొత్తంలో ఎక్కడికైనా ట్రిప్ వేయాలనుకుంటున్న వారి కోసం తక్కువ ధరలలో అనేక ప్రయాణ ప్రణాళికలను ప్రవేశపెడుతోంది. కేవలం ఇండియా మాత్రమే కాకుండా నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, దుబాయ్ కూడా రైలు, విమానాల ద్వారా ట్రిప్స్ అందిస్తోంది. ఎప్పటికప్పుడు సరికొత్త ప్యాకేజీలను అందించే ఈ IRCTC ప్రజలను ఇప్పుడు మూడు గమ్యస్థానాలకు తీసుకెళ్ళే 5 రోజుల రైలు ప్రయాణ ప్యాకేజీని ప్రవేశపెట్టింది. ఈ సీజన్‌లో అందాల హారివిల్లును పరిచయం చేసే కొండల ప్రాంతం ఊటీ, అలాగే పులులు అధికంగా ఉండే ముదుమలై, చల్లని వాతావరణాన్ని పరిచయం చేసే కూనూర్ ప్రాంతాలను ప్రజలను తీసుకెళ్లే ప్యాకేజీని తీసుకువచ్చింది. ఇంతకీ ఈ ప్యాకేజీ ఏంటీ ?.. వివరాలు తెలుకుందామా.
పాఠశాలలకు సెలవులు మరికొన్ని రోజులలో పూర్తి కావొస్తున్నాయి. మరోవైపు వర్షకాలం ప్రారంభం కాబోతుంది. ఈ సమయంలో మీ పిల్లలతో కలిసి పెద్దల కలిసి అందమైన ప్రదేశాలను సందర్శించడానికి ఇది అనువైన పర్యటన అని చెప్పొచ్చు. అలాగే ఒంటరిగా ప్రయాణించాలనుకునే వారికి ఈ ప్యాకేజీ ఉపయోగంగా ఉంటుంది. అలాగే ట్రిప్ బడ్జెట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందామా.
ప్రయాణ వివరాలు:
మొదటి రోజు:- మొదటి రోజు ప్రయాణం చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుండి రైలు నంబర్: 12671, నీలగిరి ఎక్స్‌ప్రెస్ 21.05 గంటలకు ప్రారంభమవుతుంది.
రెండవ రోజు :- ఉదయం 06.15 గంటలకు మెట్టుపాళయం చేరుకున్న తర్వాత రోడ్డు మార్గంలో ఊటీలోని హోటల్‌కు తీసుకెళ్లి వసతి కల్పిస్తారు. అక్కడి నుంచి తొట్టపేట శిఖరం, టీ మ్యూజియం, ఊటీ సరస్సు, బొటానికల్ గార్డెన్‌లను సందర్శించవచ్చు.
మూడవ రోజు: - ఉదయం మీరు షూటింగ్ లొకేషన్లు, బైకారా జలపాతం, సరస్సును సందర్శించడానికి తీసుకువెళతారు. ఆ తర్వాత ముదుమలై వన్యప్రాణుల అభయారణ్యం, ఎలిఫెంట్ క్యాంప్, జంగిల్ రైడ్‌లను సందర్శించవచ్చు.
నాల్గవ రోజు:- ఉదయం పూట మీకు మీరుగా ఊటీని వెళ్లేందుకు అనుమతిస్తారు. సిమ్స్ పార్క్, లాంబ్స్ రాక్, డాల్ఫిన్స్ నోస్‌లను సందర్శించడానికి కూనూర్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వాత రోడ్డు మార్గంలో మెట్టుపాళయం చేరుకుని 21.20కి రైలు నెం. 12672 - నీలగిరి ఎక్స్‌ప్రెస్ తిరిగి చెన్నైకి వస్తారు.
ఐదవ రోజు:- 06.20 గంటలకు చెన్నై సెంట్రల్ చేరుకుంటారు. అంతటితో ఊటీ- ముదుమలై- కూనూర్ ట్రిప్ పూర్తవుతుంది. పిల్లలు , పెద్దవారైనా అందరూ ఆనందించడానికి ఇది సరైన ప్రయాణం.
ప్యాకేజీ ధర:
5 రాత్రులు 4 రోజుల ప్యాకేజీ డబుల్, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 7900 నుండి ప్రారంభమవుతుంది. అలాగే సింగిల్ ఆక్యుపెన్సీ రూమ్‌ల కోసం, ప్యాకేజీ ధర రూ. 20750. పిల్లలకు బెడ్ ప్యాకేజీ ధర రూ. 4550, అలాగే బెడ్ అవసరం లేని పిల్లలకు , మరీ చిన్న పిల్లలకు రూ. 3700 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్యాకేజీలో ఆహారం, నీరు, రవాణా, గైడ్‌లు మొదలైన వాటికి సంబంధించిన అన్ని ఖర్చులు పూర్తిగా చెల్లించినట్లు. ముందుగా ఏర్పాటు చేసినట్టుగానే భోజనం అందించబడుతుంది. ఇష్టానుసారంగా అందించబడదు. మీరు ఇతర భోజనం తినాలనుకుంటే అది మీ స్వంత ఖర్చుతో ఉంటుంది.
ఈ ట్రిప్ ప్రతి గురువారం చెన్నై నుండి ప్రారంభమవుతుంది. మీరు ఈ ప్రయాణం చేయాలనుకుంటే, https://www.irctctourism.com/package_description?packageCode=SMR007 వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.