Iran Visa Free Country : వీసా లేకుండానే ఇరాన్ పర్యటన..భారత పర్యాటకులకు బంపర్ ఆఫర్ !
భారతీయ(Indians) పర్యాటకులకు ఇరాన్(Iran) ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఇక నుంచి తమ దేశంలో పర్యటించే భారతీయులకు ఎలాంటి వీసా(Visa) అవసరం లేదని ప్రకటించింది. భారతీయ పర్యాటకుల వీసా నిబంధనలను రద్దు చేయాలని ఇరాన్ క్యాబినెట్ నిర్ణయించింది. భారత్, గల్ఫ్ ప్రాంతం సహా 33 దేశాల పర్యాటకులకు ఈ సదుపాయం కల్పిస్తున్నట్టు ఇరాన్ ప్రభుత్వం తెలిపింది.

ప్రపంచ దేశాల నుంచి ఎక్కువ మంది పర్యాటకులను(Tourists) ఆకర్షించడమే లక్ష్యంగా ఇరాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 15న జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం ఇరాన్ సాంస్కృతిక వారసత్వం, పర్యాటకం హస్తకళల మంత్రి ఎజ్జతోల్లా జర్ఘామి ఈ విషయాన్ని ప్రకటించారు. పర్యాటకాన్ని పెంచే ప్రయత్నాలు ఇరానో ఫోబయా ప్రచారాలను నిర్వీర్యం చేయగలవని ఎజ్జతోల్లా జర్ఘామి అన్నారు.
ఇప్పటికే తుర్కియే, అజర్‌బైజాన్, ఒమన్, చైనా, అర్మేనియా, లెబనాన్, సిరియా దేశాల పర్యాటకులకు వీసా నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చింది. తాజాగా భారతీయులకు కూడా ఈ మినహాయింపునిచ్చింది. దీంతో వీసా అవసరం లేకుండా ఇరాన్‌లో పర్యటించే అవకాశమున్న దేశాల సంఖ్య 45కి చేరింది. ఈ నిర్ణయం అంతర్జాతీయ సమాజం పట్ల ఇరాన్ వైఖరికి నిదర్శనమని అన్నారు ఆ దేశ పర్యాటక శాఖ మంత్రి ఎజ్జతొల్లా జర్ఘామి.
అయితే గత కొద్దినెలలుగా పలు దేశాలు భారత పర్యాటకులకు వీసా మినహాయింపులును ఇస్తున్నాయి. ఇప్పటికే శ్రీలంక, మలేషియా, థాయ్‌లాండ్, కెన్యాలు భారత పర్యాటకులకు వీసా మినహాయింపు ఇవ్వగా.. తాజాగా ఇరాన్ కూడా ఆ జాబితాలో చేరింది.