సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) జాయింట్ డైరెక్టర్‌గా గుజరాత్ కేడర్ ఐపీఎస్ అధికారి వీ చంద్రశేఖర్ నియమితులయ్యారు. 2000 బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) అధికారి అయిన చంద్రశేఖర్ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్‌గా కూడా పనిచేశారు.
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) జాయింట్ డైరెక్టర్‌గా గుజరాత్ కేడర్ ఐపీఎస్ అధికారి వీ చంద్రశేఖర్ నియమితులయ్యారు. 2000 బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) అధికారి అయిన చంద్రశేఖర్ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్‌గా కూడా పనిచేశారు. ఐదేళ్ల కాలానికి సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా నియామకానికి కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపిందని ఉత్తర్వుల్లో పేర్కొంది.
చంద్రశేఖర్ ప్రస్తుతం సూరత్ రేంజ్ ఐజీగా పనిచేస్తున్నారు. ఇటీవలే ఆయన నేతృత్వంలో సూరత్‌లోని కడోదర కిడ్నాప్ కేసు దర్యాప్తు పూర్తయింది. తమిళనాడుకు చెందిన వి చంద్రశేఖర్ అగ్రికల్చర్‌లో పీజీ పట్టా పొందారు. ఆయన గతంలో గుజరాత్‌లోని పలు జిల్లాల్లో పనిచేశారు. అహ్మదాబాద్ రేంజ్ ఐజీగా కూడా కొంతకాలం పనిచేశారు. ఆ తర్వాత ఆయనకు సూరత్ రేంజ్ ఐజీగా బాధ్యతలు అప్పగించారు.