ఓ ఎస్పీ(SP) ముసలి కానిస్టేబుల్(Constable) మీద తన ప్రతాపాన్ని చూపించాడు. దీంతో తాను తినే ప్లేట్ ని కింద పడేసి పరిగెత్తాడు. తినే ఆహారాన్ని వదిలి విధులకు హాజరు కావాలని ఆదేశించిన ఘటన సోషల్​ మీడియాలో(Social media) వైరల్ అయింది. ఓ ఐపీఎస్(IPS)​ బాస్​ తన శాఖలో పని చేసే చిన్న ఉద్యోగి అయిన కానిస్టేబుల్​ను ఆదేశించిన తీరు విమిర్శలకు దారి తీసింది. దీంతో అన్నం తినేందుకు వృద్ధ కానిస్టేబుల్ కు హక్కు లేదా అంటున్నారు. వివరాల్లోకి వెళ్తే..

మధ్య ప్రదేశ్(Madhya Pardesh) సీఎం ఉత్తర ప్రదేశ్ లోని అజాంఘడ్ లో బీజేపీ(BJP) నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ పట్ల ఎస్పీ ప్రవర్తించిన తీరు విమర్శలకు దారి తీసింది. సాధారణంగా ముఖ్యమంత్రి పర్యటనలో పోలీసులు భారీగా బందోబస్తు నిర్వహిస్తారు. అంతేకాకుండా ఆయన పర్యటించే ప్రాంతంలో బందోబస్తు కోసం వచ్చిన బలగాల కోసం భోజనాలు.. టీ... అల్పాహారం లాంటివి ఏర్పాటు చేస్తారు. అక్కడకు వచ్చిన అతిథిలతో పాటు పోలీసులు కూడా భోజనం(Food) చేస్తుంటారు. అజంగఢ్​(Azamgarh) లో కూడా అలానే ఓ వృద్ద కానిస్టేబుల్​ భోజనం చేస్తుండగా ... ఐపీఎస్​ అధికారి.. తినడానికె రాలేదు.. డ్యూటీ చేసేందుకు వచ్చాం.. తినడం ఆపేసి డ్యూటీకి వెళ్లాలని ఆదేశించారు. దీంతో ఆ వృద్ద కానిస్టేబుల్​ తన ఎస్పీ ఆదేశించడంతో తినే ఆహారాన్ని ప్లేట్​ తో సహా డస్ట్​ బిన్​ లో పడేసి ... చేతులు కడుక్కొని భోజనం చేయకుండానే వెళ్లాడు. ఈ ఈవెంట్​ కు తినడానికి రాలేదని... డ్యూటీ చేసేందుకు వచ్చాడని.. ఎస్పీ అన్న మాటలు ఈ వీడియోలో వినపడుతున్నాయి. ఈ వీడియో చూసి నెటిజన్లు ఎస్పీ వ్యవహార శైలి పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిరు ఉద్యోగిపై మీ ప్రతాపం అంతగా అవసరమా అని ప్రశ్నించారు. కోటి విద్యలు కూటి కోసమే కదా అని కొందరు అనగా.. ఎస్పీ వ్యవహార శైలిపై విమర్శలు చేస్తున్నారు.

Updated On 15 Feb 2024 12:45 AM GMT
Ehatv

Ehatv

Next Story