Talha Saeed : పాక్ ఎన్నికల బరిలో ఉగ్రవాది హఫీజ్ కొడుకు
అంతర్జాతీయ ఉగ్రవాది(International terrorist), 26/11 ముంబాయి దాడుల మాస్టర్ మైండ్ హఫీజ్ సయీద్ స్థాపించిన పార్టీ మళ్లీ ఎన్నికల(Elections) బరిలో దిగుతోంది. త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తోది. ది పాకిస్తాన్ మర్కజీ ముస్లిం లీగ్ (PMML) పేరుతో సయీద్ ఓ రాజకీయపార్టీని ఏర్పాటు చేశాడు. ఇంతకు ముందు లష్కరే తరపున మిల్లీ ముస్లిం లీగ్ పేరిట ఓ పార్టీ ఉండింది. ఎన్నికల్లో కూడా పోటీ చేసింది. కానీ పాకిస్తాన్ ప్రజలు ఈ పార్టీని తిప్పికొట్టారు.
అంతర్జాతీయ ఉగ్రవాది(International terrorist), 26/11 ముంబాయి దాడుల మాస్టర్ మైండ్ హఫీజ్ సయీద్(Hafiz Saeed) స్థాపించిన పార్టీ మళ్లీ ఎన్నికల(Elections) బరిలో దిగుతోంది. త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తోది. ది పాకిస్తాన్ మర్కజీ ముస్లిం లీగ్ (PMML) పేరుతో సయీద్ ఓ రాజకీయపార్టీని ఏర్పాటు చేశాడు. ఇంతకు ముందు లష్కరే తరపున మిల్లీ ముస్లిం లీగ్ పేరిట ఓ పార్టీ ఉండింది. ఎన్నికల్లో కూడా పోటీ చేసింది. కానీ పాకిస్తాన్ ప్రజలు ఈ పార్టీని తిప్పికొట్టారు. ఆ తర్వాత 2018లో ఆ పార్టీపై నిషేధం విధించారు. ఆ పార్టీ మూలాల నుంచి పుట్టిందే పీఎంఎంఎల్. ఈ పార్టీ సింబల్ కుర్చీ(Chair). ప్రస్తుతం ఈ పార్టీకి ఖలీద్ మసూద్ సింధూ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు.
తమ పార్టీ జాతీయ, ప్రావిన్షియల్ అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తుందని చెప్పుకొచ్చాడు. తమ పార్టీకి ఉగ్ర సంస్థ లష్కరేతో ఎలాంటి సంబంధం లేదని అంటున్నాడు కానీ పార్టీ తరఫున హఫీజ్ తనయుడు తల్హా సయీద్(Talha Saeed) ఎన్‌ఏ-127 స్థానం నుంచి బరిలోకి దిగుతున్నాడు. 2000 సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి హఫీజ్ సయీద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. పాకిస్తాన్ మాత్రం ఇతడిపై ఉగ్ర నేరాలను మోపకపోవడమే విచిత్రం. పైగా తమకు అప్పగించాల్సిందిగా భారత్ కోరినప్పటికీ ఇప్పటి వరకు భారత్‌కు అప్పగించలేదు. 2019 జులై నుంచి ఇతడు పాకిస్థాన్ జైల్లోనే ఉన్నాడు.