✕
Andaman Island : అండమాన్ అందాలు చూడటానికి రెండు కళ్లూ చాలవు మరి..
By EhatvPublished on 27 Nov 2023 8:30 AM GMT
అండమాన్(Andaman) అంటే గుర్తుకు వచ్చేది జైలు మాత్రమే.. కాని అండమాన్ అందానికి.. ఆనందానికి .. ప్రకృతి(Nature) అద్భుతాలకు నెలవని ఎంత మందికి తెలుసు.? .. భయంకరమైన జైలు గురుతులను చెరిపివేస్తూ.. అందమైన ప్రపంచం టూరిస్ట్(World Tourism) లకు వెల్కం చెపుతుంది అండమాన్. గుర్తుకు వస్తేనే భయపడే .. ఆ భారీకారాగారం ఇప్పుడు పర్యాటక ప్రేమికులను ఆకర్షిస్తోంది. మరి అండమాన్ గురించి చాలా మందికి తెలియని కొన్ని సంగతులు ఇప్పుడు తెలుసుకుందాం..?

x
Andaman Island
-
- అండమాన్(Andaman) అంటే గుర్తుకు వచ్చేది జైలు మాత్రమే.. కాని అండమాన్ అందానికి.. ఆనందానికి .. ప్రకృతి(Nature) అద్భుతాలకు నెలవని ఎంత మందికి తెలుసు.? .. భయంకరమైన జైలు గురుతులను చెరిపివేస్తూ.. అందమైన ప్రపంచం టూరిస్ట్(World Tourism) లకు వెల్కం చెపుతుంది అండమాన్. గుర్తుకు వస్తేనే భయపడే .. ఆ భారీకారాగారం ఇప్పుడు పర్యాటక ప్రేమికులను ఆకర్షిస్తోంది. మరి అండమాన్ గురించి చాలా మందికి తెలియని కొన్ని సంగతులు ఇప్పుడు తెలుసుకుందాం..?
-
- అండమాన్ కు ఆ పేరు ఎలా వచ్చిందో చాలా మందికి తెలిసి ఉండదు.. అండమాన్ పేరు హనుమంతుడి(Lord Hanuma) నుండి ఉద్భవించిందని అక్కడి వారు చెబుతారు. మలేషియా(Malaysia) వాళ్ళఉ మన ఆంజనేయుడిని హండుమాన్ అనే పేరుతో కొలుస్తారు.. హాండుమాన్ కాస్తా.. వాడుకలో అండమాన్ గా మారిపోయింది..
-
- మ్యాప్‌లో అండమాన్ ఒక ప్రత్యేక ద్వీపం(ISland).. నాల్గవ అతిపెద్ద ద్వీపం..అందుకే లిటిల్ అండమాన్ కోసం పక్కా ప్లాన్ తో చూడటానికి ఇక్కడికి వస్తారు టూరిస్ట్ లు.. ఇక ఇక్కడి పోర్ట్‌బ్లెయిర్ నుండి 135 కిలోమీటర్ల దూరంలో బారెన్ దీవి కనిపిస్తుంది. ఇది మీకు అగ్నిపర్వతాన్ని ప్రత్యక్షంగా చూపిస్తుంది.
-
- మీకో విషయం తెలుసా.. ఇక్కడ ఉపయోగించే సాధారణ భాష బెంగాలీ(Bengali). ఆ తరువాత హిందీ, తెలుగు, తమిళం తో పాటు మలయాళం రైడా మాట్లాడుతారు. ఒక్క సారి అండమాన్ వెళ్లండి.. హ్యాపీగా తెలుగులో మాట్లాడుకుంటూ తిరగొచ్చు.. పెద్ద ఇబ్బంది ఉండని టూరిస్ట్
-
- ఈ భూమిపై అరుదైన ప్రదేశాల్లో ఇది ఒకటి.. చాలా చిత్రమైన విషయం ఏంటీ అంటే.. ఇక్కడ చేపులు కంప్లీట్ గా తమ లైఫ్ ను ఎంజాయ్ చేస్తాయి.. ఇంకా తమ జీవిత కాలాన్ని పూర్తిగా జీవిస్తాయి.. ఇది ఎలా అంటే.. ఈ ద్వీపాలలో చేపల బిజినెస్ నిషేధించబడింది. ముసలి చేపలు చూడాలి లంటే అండమాన్ వెళ్లాల్సిందే..
-
- ఈ ఐలాంగ్ కంప్లీట్ గా గిరిజనుల(Tribes) ఆస్తి. ఈ ద్వీపాల నివాసితులు ఎక్కువగా ఆదివాసీ తెగల వారే. అందులోను దాదాపుగా జర్వా తెగలోని వారే ఎక్కువగా ఇక్కడ నివాసం ఉంటున్నారు. దాదాపు 500 మంది జనాభాకలిగిన ఈ తెగకు బయటివారితో ఎలాంటి సంబంధాలు లేవు.
-
- ఇక్కడ కంప్లీట్ గా సముద్రానికి(Sea) సంబంధించిన ఆనవాలే కనిపిస్తాయి.. అంటే మీకు ఎలా చెప్పాలంటే.. సముద్ర తాబేళ్లు.. సముద్ర భారీ చేపలు..బీచ్ ఫెస్టివల్స్.. ఇలా ఇక్కడ సముద్రానికి రిలేటెడ్ గానే అన్నీ జరుగుతాయి.. ఇక్కడ ప్రత్యేకత ఏంటీ అంటే.. ప్రపంచంలో అతిపెద్ద సముద్ర తాబేళ్లు అయిన డెర్మోకిల్స్ కొరీసియోను ఇక్కడ చూడవచ్చు. అండమాన్ సముద్రంలో మీరు ఆలివ్ రిడ్లీ తాబేళ్లను కూడా చూడవచ్చు.
-
- ఇక ఇక్కడ మరో స్పెషల్ అట్రాక్షన్ పీతలు.. ఈ జాతిలో అతిపెద్ద జీవి ఆర్త్రోపోడ్ బిర్గస్ లాట్రో ఇక్కడ కనిపిస్తుంది. వాటిని కోకోనట్ క్రాబ్స్ అని కూడా పిలుస్తారు. పరిమాణంలో పెద్దగా ఉండే ఇవి నీటిని ద్వేషిస్తాయి.సౌత్ ఆసియాలో చూసుకుంటే.. ఎక్కడా లేని విధంగా ఈ పీతలు అత్యధిక సంఖ్యలో అండమాన్‌లోనే ఉన్నాయి.
-
- అండమాన్ కు మరో ప్రత్యేక ఆకర్షణ సీతాకోక చిలుకలు(Butterfly).. నికోబార్‌కు పొరుగున ఉన్న ఉష్ణమండల ఐలాండ్స్ నుంచి పొడవైన సీతాకోకచిలుకలుఇక్కడికి వస్తాయి. ప్రశాంతమైన అండమాన్ వాతావరణానికి పులకించిపోయి..అందమైన వాటి రెక్కలతో కృతజ్ఞతలు చెబుతాయి.
-
- ఈ ఐలాండ్ మొత్తం బ్రిటీష్ పరిపాలనలో ఎక్కువగా ఉండటం వల్ల.. అక్కడ ఆ ఆనవాళ్లు బాగా కనిపిస్తాయి. దానికి ప్రత్యక్ష సాక్ష్యం అండమాన్ జైలు.. ఈ జైలు గురించి చెప్పాలంటే.. చాలా ఉంది. మరో స్పెషల్ వీడియోలో అండమాన్ జైలు గురించి తెలుసుకుందా.. ఇక రెండు అండమాన్ ద్వీపాలకు నీల్ మరియు హేవ్‌లాక్ అంటూ పేరు పెట్టారు ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు.

Ehatv
Next Story