దేశంలో ప్రముఖ ఫుడ్‌ డెలీవరీ(Food delivery) సంస్థ తన వార్షిక నివేదికను వెల్లడించింది. తన నివేదికలో ఆశ్చర్యకర అంశాలు బయటపడ్డాయి. ఓ హైదరాబాదీ ఈ ఏడాదంతా ఇడ్లీలు(Idli) ఆర్డర్‌ పెట్టాడు. ఇతగాని ఇడ్లీల ఖర్చు చెప్తే మీరు ముక్కున వేలేసుకోక తప్పదు.

దేశంలో ప్రముఖ ఫుడ్‌ డెలీవరీ(Food delivery) సంస్థ తన వార్షిక నివేదికను వెల్లడించింది. తన నివేదికలో ఆశ్చర్యకర అంశాలు బయటపడ్డాయి. ఓ హైదరాబాదీ ఈ ఏడాదంతా ఇడ్లీలు(Idli) ఆర్డర్‌ పెట్టాడు. ఇతగాని ఇడ్లీల ఖర్చు చెప్తే మీరు ముక్కున వేలేసుకోక తప్పదు. ఇడ్లీల కోసం ఈ కస్టమర్‌ ఖర్చు చేసిన సొమ్ము అక్షరాల ఆరు లక్షలని స్విగ్గీ(Swiggy) వెల్లడించింది. ఇక మరో బిర్యానీ ప్రియుడైతే.. ఏకంగా ఈ ఏడాదిలో 1,633 బిర్యానీలు(Biryani) ఆర్డర్‌ పెట్టాడంట. రోజుకు 4 బిర్యానీలు ఆర్డర్‌ చేశాడు. ఈ బిర్యానీలన్నీ మనోడే తిన్నాడో.. ఇతరులతో పంచుకున్నాడో తెలియదు మరి..!

దేశవ్యాప్తంగా ప్రతీ ఆరు బిర్యానీలు ఆర్డర్లు వస్తే ఒకటి హైదరాబాద్‌ నుంచే ఉందని స్విగ్గీ వెల్లడించింది. ఈ ఏడాది కొత్తగా 20.49 లక్షల మంది కస్టమర్లు నుంచి తమకు బిర్యానీ ఆర్డర్‌ వచ్చిందని.. దేశ వ్యాప్తంగా ప్రతీ సెకన్‌కు 2.5 బిర్యానీల ఆర్డర్లు వచ్చాయని నివేదికలో వెల్లడించింది. అయితే ప్రతీ 5.5 బిర్యానీ ఆర్డర్లలో ఒక వెజ్‌ బిర్యానీ కూడా ఉందండోయ్.. దేశవ్యాప్తంగా నిమిషానికి ఈ సంస్థ 250 బిర్యానీలను డెలివరీ చేయగా.. గత ఏడాది చెన్నైకి చెందిన ఫుడ్‌ డెలివరీ బాయ్‌ వెంకటేషన్‌ 10,360 బిర్యానీలు ఆర్డర్‌ చేయగా.. కొచ్చికి చెందిన సంథిని అనే ఫుడ్‌ డెలివరీ బాయ్‌ 6,253 ఆర్డర్లను డెలీవరీ చేశాడు.

Updated On 15 Dec 2023 1:34 AM GMT
Ehatv

Ehatv

Next Story