మనమేపాపం చేశామని సూర్యుడు ఇంతగా పగబట్టాడు? కొంచెం కూడా కనికరం చూపకుండా నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. మునుపెన్నడూ లేనంతా రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలను నమోదు చేస్తున్నాడు. 103 ఏళ్లలో ఎన్నడూలేని అత్యధిక ఉష్ణోగ్రతలు ఇప్పుడే నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉన్నదో తెలుస్తోంది.
మనమేపాపం చేశామని సూర్యుడు ఇంతగా పగబట్టాడు? కొంచెం కూడా కనికరం చూపకుండా నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. మునుపెన్నడూ లేనంతా రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలను నమోదు చేస్తున్నాడు. 103 ఏళ్లలో ఎన్నడూలేని అత్యధిక ఉష్ణోగ్రతలు ఇప్పుడే నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉన్నదో తెలుస్తోంది. వాతావరణశాఖ అందించిన సమాచారం ప్రకారం 1921 తర్వాత 2024కు ముందు ఏ ఒక్క సంవత్సరంలోనూ 44 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కాలేదు. ఏప్రిల్‌లోనే రాష్ట్రంలో పలుచోట్ల 44 డిగ్రీలు దాటాయి. రాబోయే అయిదు రోజుల్లో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వాతావరణం మరింత వేడెకనున్నదని భారత వాతావరణశాఖ హెచ్చరించింది. రాబోయే అయిదు రోజులలో దేశంలోని తూర్పు, దక్షిణ భాగాలలో తీవ్రమైన వేడిగాలులు వీస్తాయని చెప్పింది. మే మాసంలో కూడా గతంలో కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని ఐఎండీ తెలిపింది. తెలంగాణలో అయితే ఎండల తీవ్రత బాగా పెరిగింది. ఈ నెల 3వ తేదీ వరకు ఎండల తీవ్రత ఉంటుంది. వివిధ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్, హైదరాబాద్, మెదక్ జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు రెడ్ అలెర్ట్‌ను జారీ చేసింది భారత వాతావరణశాఖ. రానున్న రెండు మూడు రోజుల్లో వడగాడ్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు ఇంటిపట్టునే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని తెలిపింది. మరోవైపు తెలంగాణ, కర్ణాటక, సిక్కిం రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.