చిన్నప్పుడు రైల్వే స్టేషన్‌లో చాయ్ అమ్మానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM narendra modi) చెప్పుకుంటారు కదా! చాయ్‌వాలా(chaiwala) ప్రధానమంత్రి అవ్వగా లేనిది తాను ఎమ్మెల్యే కాలేనా అని ఓ యువకుడు అనుకున్నాడు. అనుకోవడమే కాదు, అసెంబ్లీ ఎన్నికల(assembly elections) బరిలో దిగాడు కూడా! ఒడిశాకు చెందిన సుకాంత్ ఘడాయ్(sukanth) అనే 26 ఏళ్ల యువకుడు టీ అమ్ముతూ(Tea seller) జీవన గడుపుతున్నాడు.
చిన్నప్పుడు రైల్వే స్టేషన్‌లో చాయ్ అమ్మానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM narendra modi) చెప్పుకుంటారు కదా! చాయ్‌వాలా(chaiwala) ప్రధానమంత్రి అవ్వగా లేనిది తాను ఎమ్మెల్యే కాలేనా అని ఓ యువకుడు అనుకున్నాడు. అనుకోవడమే కాదు, అసెంబ్లీ ఎన్నికల(assembly elections) బరిలో దిగాడు కూడా! ఒడిశాకు చెందిన సుకాంత్ ఘడాయ్(sukanth) అనే 26 ఏళ్ల యువకుడు టీ అమ్ముతూ(Tea seller) జీవన గడుపుతున్నాడు. ఇప్పుడు పూరీ జిల్లాలోని బ్రహ్మగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నామినేషన్ వేశారు. అదృష్టం కలిసొస్తే ఎమ్మెల్యేను కాలేకపోతానా అన్న ధీమా అతడిలో ఉంది. కరీంపూర్ గ్రామానికి చెందిన సుకాంత్‌కు స్థిర, చర ఆస్తులేమీ లేవట! అలాగని నామినేషన్ పత్రాలతో పాటు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుకాంత్ ఘడాయ్ తనకు ప్రధాని మోదీనే స్ఫూర్తి అని చెబుతున్నాడు. ఎమ్మెల్యేగా గెలిస్తే లంచాల సంస్కృతిని రూపుమాపుతానని, నియోజకవర్గాన్ని అవినీతిరహితంగా తీర్చిదిద్దుతానని చెప్పాడు. అంబులెన్స్‌ల కొరత లేకుండా చేస్తానన్నాడు. సైకిల్ మీద తిరుగుతూ ప్రచారం చేస్తున్న సుకాంత్ పది మంది దృష్టిలో పడుతున్నాడు. ఈ నెల 25వ తేదీన ఇక్కడ పోలింగ్ జరుగుతుంది.