ఢిల్లీలో జరిగిన లిక్కర్‌ స్కామ్‌లో(Delhi liquor Scam) బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితనే(Brs Mlc Kavitha) కీలక సూత్రధారి అన్నది సీబీఐ(CBI) ఆరోపణ.

ఢిల్లీలో జరిగిన లిక్కర్‌ స్కామ్‌లో(Delhi liquor Scam) బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితనే(Brs Mlc Kavitha) కీలక సూత్రధారి అన్నది సీబీఐ(CBI) ఆరోపణ. ఆమ్‌ ఆద్మీ పార్టీకి(Aam Aadmi Party) వంద కోట్ల రూపాయల ముడుపులు, లిక్కర్‌ పాలసీ (Liquor policy)రూపకల్పన, సౌత్‌ గ్రూపు నుంచి డబ్బులను సమకూర్చడం వంటివి కవిత చేశారని సీబీఐ అంటోంది.

ఈ కేసులో ఇప్పటికే పలు మార్లు కవిత బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేయగా సాక్షులుగా ఉన్నవారిని ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉండడం పట్ల ఈడీ(ED), సీబీఐ ఆరోపించడంతో న్యాయస్థానం కవిత పిటిషన్లను కొట్టి వేసి ఆమె కస్టడీని పొడిగిస్తూ వస్తున్నది. ఈ క్రమంలోనే రౌస్‌ అవెన్యూ స్పెషల్ కోర్టులో(Rouse Avenue Special Court) ఇవాళ లిక్కర్‌ కేసు విచారణ జరిగింది. జడ్జి కావేరి భవేజా (Judge Kaveri Baweja)విచారణ జరిపారు. సీబిఐ కేసులో A17 గా కవిత ఉంది. సీబిఐ ఛార్జ్ షీట్(CBI Charge Sheet) ను స్క్రూటినీ చేసేందుకు కొంత సమయం కావాలని కవిత తరపు న్యాయవాది కోరారు. దానికి ఇప్పటికే సమయం ఇచ్చామన్న జడ్జి కావేరి బవేజా అన్నారు. దింతో కేసు తదుపరి విచారణను ఆగస్ట్ 9వ(August 9) తేదీకి వాయిదా వేశారు.

ehatv

ehatv

Next Story