మహారాష్ట్రలో(Maharastra) ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. స్పీడ్‌గా వచ్చిన ఓ కారు టోల్‌ప్లాజా(Toll Plaza) దగ్గర క్యూ లైన్‌లో ఉన్న వాహనాలను ఢీకొట్టింది. ఫలితంగా ముగ్గరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

Mumbai Toll Plaza Accident
మహారాష్ట్రలో(Maharastra) ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. స్పీడ్‌గా వచ్చిన ఓ కారు టోల్‌ప్లాజా(Toll Plaza) దగ్గర క్యూ లైన్‌లో ఉన్న వాహనాలను ఢీకొట్టింది. ఫలితంగా ముగ్గరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ముంబైలోని(Mumbai) వర్లీ ప్రాంతంలోని టోల్‌ప్లాజా దగ్గర ఈ సంఘటన చోటు చేసుకుంది. గురువారం రాత్రి వర్లీ నుంచి బంద్రావైపు వెళుతున్న ఇన్నోవా కారు(Innova Car) అత్యంత వేగంగా వచ్చి వాహనాలను బలంగా ఢీకొట్టింది. మొదట మెర్సిడెస్ కారును ఢీకొట్టిన ఇన్నోవా తర్వాత మరో రెండు మూడు వాహనాలను ఢీకొట్టింది. మెర్సిడెస్, ఇన్నోవాలతో పాటు మొత్తం ఆరు కార్లు ప్రమాదానికి గురయ్యాయి. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
