World Idli Day : ఇవాళ ప్రపంచ ఇడ్లీ దినోత్సవం
మామూలు రోజుల్లో ఇష్టంగా, వంట్లో బాగోలేనప్పుడు అయిష్టంగా తినే అల్పాహారం ఇడ్లీకి(Idli) కూడా ఓ రోజుంటుంది. ఆ రోజు ఈ రోజే! అంటే ఇవాళ అనగా మార్చి 30వ తేదీన ప్రపంచ ఇడ్లీ దినోత్సవం(World Idli Day) . కాబట్టి ఇనియవాన్‌ను(Iniyavan) గుర్తు చేసుకుందాం! ఆయన ఎవరంటే కోయంబత్తూరు(Coimbatore) నివాసి. కానీ బతుకుదెరువు కోసం మద్రాస్ చేరి ఇడ్లీలు చేసి అమ్మే దుకాణం పెట్టి వందల రకాల ఇడ్లీలు చేశారు.
మామూలు రోజుల్లో ఇష్టంగా, వంట్లో బాగోలేనప్పుడు అయిష్టంగా తినే అల్పాహారం ఇడ్లీకి(Idli) కూడా ఓ రోజుంటుంది. ఆ రోజు ఈ రోజే! అంటే ఇవాళ అనగా మార్చి 30వ తేదీన ప్రపంచ ఇడ్లీ దినోత్సవం(World Idli Day) . కాబట్టి ఇనియవాన్‌ను(Iniyavan) గుర్తు చేసుకుందాం! ఆయన ఎవరంటే కోయంబత్తూరు(Coimbatore) నివాసి. కానీ బతుకుదెరువు కోసం మద్రాస్ చేరి ఇడ్లీలు చేసి అమ్మే దుకాణం పెట్టి వందల రకాల ఇడ్లీలు చేశారు. 20 రకాల ఇడ్లీలకు పేటెంట్ హక్కులు పొందారు. ఆ కృషికి గుర్తింపుగా తమిళనాడు కుకింగ్ అసోసియేషన్ ఆయన పుట్టిన రోజైన మార్చి 30 వతేదీని ప్రపంచ ఇడ్లీ దినోత్సవంగా ప్రకటించింది. అదన్నమాట సంగతి. అసలు ఇడ్లీ ఇండోనేషియాలో 800 -1200 సంవత్సరాల మధ్య రూపొందిన పుల్లటి వంటకం! ఎలాగో అలాగ దక్షిణాదికి చేరింది. ఇడ్లీపై భారతదేశంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో జరిగినన్ని ప్రయోగాలు ఎక్కడా జరిగివుండవు. సౌత్ ఇండియన్స్ ఎక్కడ వుంటే ఇడ్లీ అక్కడ వుంటుంది.