గత రెండు దశాబ్దాలుగా గొప్ప పురోగతి సాధించిన ఆర్థిక వ్యవస్థలతో భారతదేశం పోటీ పడాలంటే.. భారతీయ యువత వారానికి 70 గంటలు పని చేయడం ప్రారంభించాలని భారతీయ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్(Infosys) వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి(Narayana Murthi) అన్నారు.

Infosys Founder Narayana Murthi
గత రెండు దశాబ్దాలుగా గొప్ప పురోగతి సాధించిన ఆర్థిక వ్యవస్థలతో భారతదేశం పోటీ పడాలంటే.. భారతీయ యువత వారానికి 70 గంటలు పని చేయడం ప్రారంభించాలని భారతీయ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్(Infosys) వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి(Narayana Murthi) అన్నారు. ఆయన ప్రతిపాదించిన 70 గంటల పనిని ఆరు రోజులకు విభజిస్తే ఉద్యోగులు రోజు 12 గంటల షిఫ్ట్‌లు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఐదు రోజులే పని దినాలు అయితే 14 గంటల షిఫ్ట్‌ను చేయాల్సి ఉంటుంది.
ఇన్ఫోసిస్ మాజీ CFO మోహన్‌దాస్ పాయ్‌తో(Mohan Das) సంభాషణలో నారాయణ మూర్తి పాల్గొన్నారు. దేశ నిర్మాణం, సాంకేతికతతో సహా వివిధ అంశాలపై ఆయన మాట్లాడారు. భారతీయ పని ఉత్పాదకత ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యల్ప ర్యాంక్‌లో ఉందని.. చైనా వంటి ఆర్థిక వ్యవస్థలతో పోటీ పడాలంటే భారతీయ శ్రామిక శక్తి ఎక్కువ గంటలలో పని చేయాల్సిన అవసరం ఉందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.
మన యువకులకు తప్పక చేయాలనుకునే అభ్యర్థన ఏమిటంటే.. ఇది నా దేశం.. నేను వారానికి 70 గంటలు పని చేయాలనుకుంటున్నాను అని చెప్పారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జర్మన్లు, జపనీయులు సరిగ్గా ఆ పని చేశారని పేర్కొన్నారు.
ఇప్పటికే ఎక్కువ పని గంటలతో శ్రమ దోపిడీ చేస్తున్నారని వాదించే వారికి.. దేశంలో సరైన కార్మిక చట్టాలు లేవని మాట్లాడే వారికి నారాయణమూర్తి ప్రకటన మరింత ఆందోళన కలిగించే విషయమే.
