బిక్షగాళ్ల సంపాదన ఎంత ఉంటుంది. మాహా అంటే రోజుకు 200-300 వరకు ఉంటుందనుకుంటాం. ఆకలికి అలమటిస్తున్నట్లు, మాసిన బట్టలు, మాడిపోయిన మొహం, చెదిరిన జుట్టుతో భిక్షాటన చేసేవారిని చూసి మనం జాలి పడతాం. యాచకులు వచ్చి అడగ్గానే ఎంతో కొంత సాయం చేస్తుంటాం. తీర్థయాత్రలకు వెళ్లినప్పుడు, గుళ్లకు వెళ్లినప్పుడు అక్కడ ఉండే భిక్షగాళ్లను చూసి దయతో డబ్బులు ఇస్తుంటాం. మన బలహీనతే భిక్షగాళ్లను లక్షాధికారులను చేస్తోంది. ఇండోర్‌ను(Indore) బెగ్గర్‌ ఫ్రీ సిటీగా(Begger Free City) మార్చే కార్యక్రమంలో భాగాంగా తనిఖీలు చేస్తున్న పోలీసులకు ఓ యాచకురాలు పట్టుబడింది. విచారణలో ఆమె చెప్పిన విషయాలు విని విస్తుపోవడం పోలీసుల వంతైంది. పూర్తి వివరాలు చూస్తే..

ఇండోర్‌లో ఓ మహిళ భిక్షాటన వృత్తిని ఎంచుకుంది. ఆమె చూసే చూపులు, చినిగిపోయి ఉన్న ఆమె దుస్తులు, ఆకలికి అలమటిస్తున్నట్లుగా ఆమె చేసే నటనను చూసి ఎవరికైనా గుండె తరుక్కుపోతుంది. దీంతో ఆమెపై జాలిపడి ఎంతో కొంత ఇవ్వాలని అనిపిస్తుంది. ఈ దయా గుణమే ఆమెకు ఆదాయ మార్గంగా మారింది. ఆమె ఏడాది సంపాదన అక్షరాల 20 లక్షల పైమాటే అంట. కేవలం 45 రోజుల్లో రూ. 2.5 లక్షల చొప్పున సంపాదిస్తోందని తేలింది. ప్రతి 45 రోజులకు తాను సంపాదించిన రూ.2.5 లక్షల నుంచి ఒక లక్ష రూపాయలను తన పుట్టింట్లో ఉన్న ఇద్దరు పిల్లల కోసం పంపిస్తుంది. మరో రూ.50 వేలను పిల్లల పేరు మీద ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తుందట. మిగతా సొమ్మును ఆమె తన వ్యక్తిగత అవసరాలకు ఖర్చుపెడుతుందని పోలీసులకు తెలిపింది. దీంతో పోలీసులు నోరెళ్లబెట్టారు. అంతేకాకుండా ఇదే వృత్తిలోనే ఆమె భర్త, చెల్లెలు, ఇద్దరు పెద్ద పిల్లలు కొనసాగుతున్నట్లు తెలిపింది. ఇండోర్‌ నుంచి ఉజ్జయినికి వెళ్లే మార్గంలో పలు ప్రాంతాల్లో భిక్షాటన చేస్తున్నట్లు పోలీసులకు చెప్పింది. అయితే ఆ మహిళా కుటుంబసభ్యులను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా వారు పారిపోయారు. అయినా పోలీసులు వారిని గాలించి పట్టుకున్నారు.

కానీ ఆ మహిళ పోలీసులను ఎదురు ప్రశ్నించింది. తాము దొంగతనాలు చేయడంలేదని, ప్రజలను మోసం చేయడం లేదని వాదించింది. తాము ప్రజల దగ్గర అడొక్కిని డబ్బులు సంపాదించుకుంటున్నామని పోలీసులతో వాగ్వాదానికి పాల్పడింది. యాచకురాలి గురించి పోలీసులు ఆరా తీయగా దాదాపు ఏడాదికి రూ.20 లక్షలు సంపాదిస్తోందని తేలింది. ఈ భిక్షగత్తె కుటుంబానికి ఖరీదైన ఇల్లు, భారీగా బ్యాంకు బ్యాలెన్స్‌లు, ఖరీదైన ఫోన్లు ఉన్నట్లు తేలింది. పట్టుబడిన సమయంలో రూ.19 వేల నగదు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. గత ఏడాది కూడా ఈ యాచకురాలికి కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపించామని పోలీసులు తెలిపారు. అయినా కూడా ఆమె అదే వృత్తిని కొనసాగిస్తుండడంతో మరోసారి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఇండోర్‌లో 7 వేల మంది వరకు భిక్షగాళ్లు ఉన్నారని వారంతా దాదాపు లక్షాధికారులనేనని పోలీసులు వెల్లడించారు. దేశంలోని దాదాపు అన్ని నగరాల్లో భిక్షగాళ్లు ఉన్నారు. కొందరు యాచక ముఠాల చెరలో చిక్కుకుని భిక్షాటన చేస్తున్నారు.

Updated On 13 Feb 2024 5:39 AM GMT
Ehatv

Ehatv

Next Story