ఈ ఏడాది మే నుంచి అయోధ్యలో(Ayodhya) మసీదు(Masjid) నిర్మాణాన్ని ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్(Indo-Islamic culture Foundation) ప్రారంభించనుంది. మసీదు నిర్మాణం పూర్తయ్యేందుకు మూడు-నాలుగేళ్లు పట్టే అవకాశం ఉంది. రామమందిరంలో(Ram mandir) బాలరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం రోజే ఈ వార్త బయటకు వచ్చింది. మసీదు ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్న ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ (ఐఐసిఎఫ్) డెవలప్‌మెంట్ కమిటీ అధినేత హాజీ అర్ఫత్ షేక్ ఈ విషయాన్ని వెల్లడించారు.

Muhammad bin Abdullah Masjid
ఈ ఏడాది మే నుంచి అయోధ్యలో(Ayodhya) మసీదు(Masjid) నిర్మాణాన్ని ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్(Indo-Islamic culture Foundation) ప్రారంభించనుంది. మసీదు నిర్మాణం పూర్తయ్యేందుకు మూడు-నాలుగేళ్లు పట్టే అవకాశం ఉంది. రామమందిరంలో(Ram mandir) బాలరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం రోజే ఈ వార్త బయటకు వచ్చింది. మసీదు ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్న ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ (ఐఐసిఎఫ్) డెవలప్‌మెంట్ కమిటీ అధినేత హాజీ అర్ఫత్ షేక్ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రణాళికాబద్ధమైన మసీదు కోసం నిధులను సమకూర్చుకునేందుకు క్రౌడ్ ఫండింగ్ వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఇప్పటి వరకు నిధుల కోసమైతే ఎవరినీ సంప్రదించలేదని ఫౌండేషన్ అధికారులు తెలిపారు.
ముహమ్మద్ ప్రవక్త పేరు మీదుగా ఈ మసీదుకు "మస్జిద్ ముహమ్మద్ బిన్ అబ్దుల్లా"(Masjid Muhammad bin Abdullah) అని పేరు పెట్టారు. ప్రజల మధ్య శత్రుత్వాన్ని, ద్వేషాన్ని తగ్గించిందుకే మా ప్రయత్నమని అర్ఫత్ షేక్ వెల్లడించారు. హిందూ, ముస్లింల మధ్య ఘర్షణలు, వివాదాలు ఆగిపోయి పిల్లలకు మంచి విద్యాబుద్దులు నేర్పించాలని షేక్ సూచించారు. ఐఐసిఎఫ్ కార్యదర్శి అథర్ హుస్సేన్ మాట్లాడుతూ సాంప్రదాయబద్ధంగా మసీదు డిజైన్ రూపొందించలనుకున్నందుకే నిర్మాణం ఆలస్యమవుతుందని తెలిపారు.
అయితే 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత చట్టవిరుద్ధమని 2019లో సుప్రీంకోర్టు పేర్కొంది. కానీ బాబ్రీ మసీదు కింద ఇస్లామేతర నిర్మాణం ఉందని తేల్చింది. వివాదాస్పద స్థలంలో రామాలయాన్ని నిర్మించుకొని, మసీదు నిర్మాణం కోసం స్థలాన్ని కేటాయించాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పుతో ఇరు వర్గాలు సంతృప్తి చెందాయి. దీంతో ఇటు రామాలయానికి, అటు మసీదు నిర్మాణాలకు మార్గం సుగుమమైంది
