దట్టమైన పొగమంచు కారణంగా విమానాలు ఆలస్యమవుతున్నాయి. ప్రయాణికుల్లో బీపీ పెరుగుతోంది. విమానయాన సంస్థలు కలిగిస్తున్న అరకొర సౌకర్యాలతో ప్రయాణికులు ఇబ్బందిపడుతున్నారు. ఇలా ప్రయాణికులకు అసౌకర్యం కలిగించినందుకు ఇండిగో, ముంబాయి విమానాశ్రయానికి కేంద్ర విమానయాన మంత్రిత్వశాఖ నోటీసులు ఇచ్చింది. విమానం ఆలస్యం కావడంతో ప్రయాణికులు రన్‌వేపై కూర్చొని డిన్నర్‌ చేస్తున్న వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

దట్టమైన పొగమంచు కారణంగా విమానాలు ఆలస్యమవుతున్నాయి. ప్రయాణికుల్లో బీపీ పెరుగుతోంది. విమానయాన సంస్థలు కలిగిస్తున్న అరకొర సౌకర్యాలతో ప్రయాణికులు ఇబ్బందిపడుతున్నారు. ఇలా ప్రయాణికులకు అసౌకర్యం కలిగించినందుకు ఇండిగో(Indigo), ముంబాయి విమానాశ్రయానికి( Mumbai Airport) కేంద్ర విమానయాన మంత్రిత్వశాఖ నోటీసులు (Union Aviation Ministry Notices) ఇచ్చింది. విమానం ఆలస్యం కావడంతో ప్రయాణికులు రన్‌వేపై కూర్చొని డిన్నర్‌ (Dinner on runway) చేస్తున్న వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ (Viral on social media) అయ్యాయి. దీంతో అధికారులు స్పందించారు. ఈ ఘటనకు ఇండిగోతో పాటు ముంబాయి విమానాశ్రయం రెస్పాన్సిబులిటీ కూడా ఉందని నోటీసులు పేర్కొన్నారు. విమానాశ్రయంలో అవకాశం ఉన్నప్పటికీ ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించలేదని విమానయాన మంత్రిత్వశాఖ మండిపడింది. పొగమంచు కారణంగా ముంబాయి ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానం ఆలస్యం (Indigo flight delayed) అయింది. దీంతో ప్రయాణిికులు రన్‌వేపైనే వేచి ఉన్నారు. అక్కడే డిన్నర్‌ కూడా చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విమానాశ్రయంలో విశ్రాంతి గదులు, రిఫ్రెష్‌మెంట్లు వంటి సౌకర్యాలు అవకాశం ఉన్నప్పటికీ ప్రయాణికులను రన్‌వేపైనే ఉంచడంపై కేంద్రం మంత్రిత్వ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. మొన్నటికి మొన్న విమానం ఆలస్యం కావడంపై ఢిల్లీ విమానాశ్రయంలో ఇండిగో కెప్టెన్‌పై ఓ ప్రయాణికుడు చేయిచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేంద్ర విమానయాన శాఖా మంత్రి సింథియా స్పందించారు. ప్రయాణికులు ఇలాంటి చర్యలకు పాల్పడకూడదని కోరారు.

Union Aviation Minister Cynthia
Updated On 16 Jan 2024 6:49 AM GMT
Ehatv

Ehatv

Next Story