మహిళలపై రేప్ కేసులు భారతదేశంలో చాలా సీరియస్ ఇష్యూ.

మహిళలపై రేప్ కేసులు భారతదేశంలో చాలా సీరియస్ ఇష్యూ. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) డేటా ఆధారంగా 2022 ప్రకారం భారతదేశంలో మొత్తం 31,516 రేప్ కేసులు నమోదయ్యాయి, అంటే రోజుకు సుమారు 86 కేసులు లేదా ప్రతి 15 నిమిషాలకు ఒక కేసు.

2014 నుండి 2022 వరకు, మహిళలపై నేరాలు రేప్‌తో సహా మొత్తంగా 30% పెరిగాయి. రేప్ కేసులు 2016లో 38,947 గరిష్ట స్థాయికి చేరాయి, ఆ తర్వాత కొంచెం తగ్గినప్పటికీ, సంఖ్య ఇప్పటికీ ఆందోళనకరంగానే ఉంది. 2024 రిపోర్ట్‌లో రేప్ కేసులు 1.1% పెరిగినట్లు సూచనలు ఉన్నాయి, కానీ ఖచ్చితమైన సంఖ్యలు ఇంకా స్పష్టంగా లేవు.

రేప్ కేసుల్లో ఎక్కువ నమోదైన రాష్ట్రాల్లో ఉత్తర్ ప్రదేశ్(Uttar Pradesh), మహారాష్ట్ర(Maharasta), రాజస్థాన్(Rajasthan), మధ్యప్రదేశ్. UPలో 2022లో 65,743 మహిళలపై నేరాలు నమోదయ్యాయి, అందులో రేప్ కేసులు కూడా గణనీయంగా ఉన్నాయి. ఢిల్లీ(Delhi)లో రేప్ కేసుల రేటు ప్రతి లక్ష మందికి 144.4, ఇది జాతీయ సగటు 66.4 కంటే చాలా ఎక్కువ. రేప్ కేసుల్లో కన్విక్షన్ రేటు దోషులకు శిక్ష పడే రేటు చాలా తక్కువగా ఉంది. 2018 నుండి 2022 వరకు 27-28% మాత్రమే. దీనికి కారణం ఆలస్యమైన దర్యాప్తు, ఆధారాల కొరత, లేదా సామాజిక/రాజకీయ ఒత్తిళ్లు కావచ్చు. చాలా ప్రాంతాల్లో సరైన లైటింగ్,CCTV, లేదా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో భద్రత లేకపోవడం కారణం. భారతీయ శిక్షా స్మృతి (IPC), POCSO వంటి చట్టాలు ఉన్నప్పటికీ, దర్యాప్తులో ఆలస్యం, పోలీస్ అవినీతి, లేదా జ్యుడీషియల్ బ్యాక్‌లాగ్ వల్ల న్యాయం ఆలస్యమవుతుంది. కొన్ని కేసులు నిర్భయ, కోల్‌కతా (Kolkata)డాక్టర్ కేసు వంటివి జాతీయ దృష్టిని ఆకర్షిస్తాయి, కానీ చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో జరిగే కేసులు తరచూ పట్టించుకోరు. జార్ఖండ్‌(Jharkhand)లో ఓ విదేశీ టూరిస్ట్‌పై గ్యాంగ్ రేప్ జరిగిన సంఘటన జాతీయంగా చర్చనీయాంశమైంది. ఇది మహిళల భద్రత, పర్యాటక రక్షణపై మళ్లీ ప్రశ్నలు లేవనెత్తింది.

హైదరాబాద్, నాగర్ కర్నూల్‌లో 2025లో మహిళలపై జరిగిన దాడుల గురించి సోషల్ మీడియాలో చర్చ జరిగింది, ఇవి స్థానికంగా ఆందోళన కలిగించాయి. నిర్భయ కేసు తర్వాత, 2013లో క్రిమినల్ లా అమెండ్‌మెంట్ యాక్ట్ (Criminal Law Amendment Act)తీసుకొచ్చారు, రేప్‌కు కఠిన శిక్షలు (7 సంవత్సరాల నుండి జీవిత ఖైదు వరకు) నిర్ణయించారు. కొన్ని కేసుల్లో డెత్ పెనాల్టీ కూడా ఉంది. అయినా కూడా దేశంలో రేప్‌లు ఆగడం లేదు.

ehatv

ehatv

Next Story