ప్రపంచంలో సాంకేతిక ఆధునిక పంతలు తొక్కుతోంది. రోజురోజుకు సాంకేతికతో కొత్త, కొత్త విప్లవాలు సృష్టిస్తున్నారు. ఈ కోవలోనిదే డిజిటల్ చెల్లింపులు(Digital payments). గతంలో ఏదైనా వస్తువులు కొనాలన్న, అమ్మాలన్న నగదుపై(Hard cash) ఆధారపడేవారు. చేతిలో కరెన్సీ నోట్లు ఉంటేనే అమ్మకాలు, కొనుగోళ్లు జరిగేవి. రానురాను కార్డుల ద్వారా ఈ లావాదేవీలు జరిగాయి. క్రెడిట్ లేదా డెబిట్ కార్డులు(Cards) ఉపయోగంలోకి వచ్చాయి. నోట్ల రద్దు తర్వాత డిజిటల్ పేమెంట్స్ Phonepe, Paytm, Google Pay వంటివి మార్కెట్‌లోకి ప్రవేశించాయి.

కానీ ఇప్పుడు మీ చేతికి చిన్న ఉంగరం(Finger Ring) ఉంటే చాలు. ఎలాంటి లావాదేవీలైనా చేసుకోవచ్చు. అదేంటి ఉంగరంతో ఎలా చెల్లిస్తాం అనుకుంటున్నారా.. అవును స్మార్ట్ రింగ్‌తో(Smart ring) ఈ చెల్లింపులు చేసుకునే అవకాశం వచ్చింది. ఈ రింగ్‌ను స్మార్ట్‌ఫోన్‌తో జత చేయడం అవసరం లేదు, డిజిటల్ ప్రీపెయిడ్ వాలెట్‌కి(Digital prepaid wallet) లింక్ చేయడంతో స్మార్ట్ ఫోన్ యాప్‌లతో లింక్ అవసరం ఉండదు. దీనికి చార్జింగ్ కూడా అవసరం లేదని తయారీ కంపెనీ వెల్లడించింది. కాంటాక్ట్ లెస్(Contact less) చెల్లింపుల కోసం ఈ స్మార్ట్ రింగ్‌ను 7 రింగ్ అనే కంపెనీ తయారు చేసింది. ఇది ప్రీమియం జిర్కోనియా సిరామిక్ మెటీరియల్‌తో తయారైంది. ఈ రింగ్‌లు వేర్వేరు పరిమాణాలలో అందుబాటులో ఉన్నాయి. రూ. 5 వేల లోపు చెల్లింపులు చేయడానికి స్మార్ట్‌ఫోన్ యాప్, OTP / PIN అవసరం కూడా లేదు. స్మార్ట్ రింగ్ ద్వారా చేసే చెల్లింపుల కోసం ఓ ప్రీ పెయిడ్ వాలెట్‌ను ఇన్‌స్టాల్(Install) చేసుకొవాలని.. ప్రీపెయిడ్ వాలెట్‌తో స్మార్ట్ రింగ్ లింక్ చేసి చెల్లింపులు చేసుకోవచ్చని వెల్లడించారు. దీని ద్వారా బ్యాంక్ ఖాతాకు ఎలాంటి ఢోకా ఉండదని, సెక్యూరిటీ కూడా లభిస్తుందని చెప్తున్నారు. 7 రింగ్ సంస్థ తయారుచేసిన స్మార్ట్ రింగ్ ధర రూ. 7వేలు ఉంది. మరికొన్ని సంస్థలు కూడా ఈ స్మార్ట్ రింగ్‌లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. వేలుకు సాధారణంగా ధరించే ఉంగరంలా కాకుండా మరింత ఆకర్షణీయంగా తయారు చేస్తున్నారు.