ఒడిశాలోని(Odisa) పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారం(Ratna bhandagar) రహస్య గదుల్లో(Secrete room) ఏం ఉందో తెలుసుకోవడానికి దేశం మొత్తం ఆసక్తి చూపిస్తోంది.
ఒడిశాలోని(Odisa) పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారం(Ratna bhandagar) రహస్య గదుల్లో(Secrete room) ఏం ఉందో తెలుసుకోవడానికి దేశం మొత్తం ఆసక్తి చూపిస్తోంది. ఈ నెల 14వ తేదీన భాండాగారంలోని తొలి రెండు గదుల్లో ఉన్న పురుషోత్తముని సంపదను బయటకు తీసి స్ట్రాంగ్‌రూంకు పెద్ద పెద్ద పెట్టెల్లో పెట్టి తరలించారు. పూరీ జగన్నాథుడి ఆలయ రత్న భాండాగారాన్ని 46 ఏళ్ల తర్వాత తెరవడంతో అందులో సంపదపై సర్వత్రా ఆసక్తి నెలకుంది. అయితే, రత్న భాండాగారంలో మరో రహస్య గది ఉందని పలువురు చరిత్రకారులు చెప్తున్నారు. ఆ గదిలోకి సొరంగం నుంచి వెళ్లాల్సి ఉంటుందని, దానిలో విలువైన సంపద దాచిపెట్టారని అంటున్నారు. బ్రిటిషర్ల హయాంలో 1902లో ఈ సొరంగ మార్గం అన్వేషేంచి విఫలం చేందారని చరిత్రకారులు గుర్తు చేస్తున్నారు. కాబట్టి సొరంగ మార్గం, రహస్య గదిని గుర్తించడంపై దృష్టి పెట్టాలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు.
ఈ మేరకు శ్రీక్షేత్ర కార్యాలయంలో మంగళవారం భాండాగారం అధ్యయన సంఘం జస్టిస్ బిశ్వనాథ్ రథ్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి రహస్య గది తలుపులు తెరవడానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. గురువారం ఉదయం 9.51 నుంచి 12.15 గంటల వరకు శుభముహూర్తంగా నిర్ణయించారు. రహస్య గదిలోని విలువైన వస్తువులను స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపర్చనున్నారు. ఆ తర్వాత పురావస్తుశాఖ ఆధ్వర్యంలో మరమ్మతులు నిర్వహిస్తారు. రహస్య గది తెరుస్తున్న కారణంగా ఆలయంలోకి గురువారం ఉదయం నుంచి భక్తుల ప్రవేశాన్ని నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు.
అయితే రహస్య గదిలో ఎంత విలువైన సంపద వివరాలను మీడియాకు ప్రముఖ చరిత్రకారుడు నరేంద్రకుమార్ మిశ్రా(Narendra kumar mishra) వెల్లడించారు. రాజా కపిలేంద్రదేవ్ తూర్పు, దక్షిణ ప్రాంతాల రాజులపై దండెత్తి వారిని జయించి విలువైన సంపదను తెచ్చి పురుషోత్తమునికి సమర్పించినట్లు ఆధారాలున్నట్లు ఆయన చెప్తున్నారు. రత్నాభాండాగారం దిగువన సొరంగ మార్గం తవ్వి ఆభరణాలు భద్రపర్చడానికి రహస్య గదిని నిర్మించినట్లు నరేంద్రకుమార్ అంటున్నారు. ఈ గదిలో 34 కిరీటాలు, రత్నాలతో స్వర్ణ సింహాసనాలు, మహాలక్ష్మి అమ్మవారి వడ్డాణాలతో పాటు దేవతల పసిడి విగ్రహాలు ఉన్నట్లు చెప్తున్నారు. ఈ సంపద అత్యంత విలువైనదని, దీనిని వెల కట్టలేమంటున్నారు.