రాజస్థాన్(Rajasthan) లోని జైసల్మేర్‌లో(Jaisalmer) భారత వాయుసేనకు చెందిన ఓ తేజస్ యుద్ధ విమానం(Tejas Fighter Jet) నేల కూలింది. శిక్షణ కార్యకలాపాల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
రాజస్థాన్(Rajasthan) లోని జైసల్మేర్‌లో(Jaisalmer) భారత వాయుసేనకు చెందిన ఓ తేజస్ యుద్ధ విమానం(Tejas Fighter Jet) నేల కూలింది. శిక్షణ కార్యకలాపాల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అప్రమత్తమైన పైలట్ సురక్షితంగా ముందుగానే బయటకు వచ్చేశారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది వాయుసేన. స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ రూపొందించిన యుద్ధ విమానాల్లో తేజస్ ఒకటి. 2016లో దీన్ని వాయుసేనలోకి చేర్చారు. తేజస్ కూలి పోవడం ఇదే మొదటిసారి. పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్‌లో భారత్ శక్తి పేరిట సైనిక విన్యాసాలు కొనసాగుతోన్న వేళ ఈ ఘటన చోటు చేసుకుంది. కూలి పోయిన యుద్ధ విమానం మంటల్లో చిక్కుకు పోవడంతో అగ్నిమాపక సిబ్బంది చర్యలు తీసుకున్నారు.