గత అయిదేళ్లలో విదేశాలలో చదువుకోవడానికి వెళ్లిన భారత విద్యార్థులలో403 మంది చనిపోయారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వీరిలో కెనడా(Canada)కు వెళ్లినవారే ఎక్కువ మంది ఉన్నారని వివరించింది. 2018 నుంచి ఇప్పటివరకు కెనడా వెళ్లిన 91 మంది విద్యార్థులు వివిధ కారణాల వల్ల చనిపోయారు. బ్రిటన్(Britain)కు వెళ్లిన 48 మంది విద్యార్థులు మరణించారు.
గత అయిదేళ్లలో విదేశాలలో చదువుకోవడానికి వెళ్లిన భారత విద్యార్థులలో403 మంది చనిపోయారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వీరిలో కెనడా(Canada)కు వెళ్లినవారే ఎక్కువ మంది ఉన్నారని వివరించింది. 2018 నుంచి ఇప్పటివరకు కెనడా వెళ్లిన 91 మంది విద్యార్థులు వివిధ కారణాల వల్ల చనిపోయారు. బ్రిటన్(Britain)కు వెళ్లిన 48 మంది విద్యార్థులు మరణించారు. సహజ మరణాలతో పాటుగా ఆరోగ్యపరమైన సమస్యలతో కొందరు చనిపోతే, యాక్సిడెంట్లతో కొందరు మరణించారని కేంద్ర విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటిలో కొన్ని అనుమానాస్పద మరణాలు ఉన్నాయని పేర్కొంది. విదేశాలలో ఉన్న భారత విద్యార్థుల భద్రత తమకు అత్యంత ముఖ్యమని కేంద్ర మంత్రి మురళీధరన్ అన్నారు.