లండన్‌(London)లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం(Road Accident)లో భారత్‌కు చెందిన చేష్ఠా కొచ్చర్‌ మృతి చెందింది. ‘లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌’ (LSE)లో చేష్ఠా కొచ్చర్‌ పీహెచ్‌డీ చేస్తున్నారు. ఈ సమాచారాన్ని నీతి ఆయోగ్‌ మాజీ సీఈఓ అమితాబ్‌ కాంత్‌ ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు. గతంలో ఆమె నీతి ఆయోగ్‌కు సంబంధించిన ఓ ప్రాజెక్టు కోసం పనిచేశారు.

లండన్‌(London)లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం(Road Accident)లో భారత్‌కు చెందిన చేష్ఠా కొచ్చర్‌ మృతి చెందింది. ‘లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌’ (LSE)లో చేష్ఠా కొచ్చర్‌ పీహెచ్‌డీ చేస్తున్నారు. ఈ సమాచారాన్ని నీతి ఆయోగ్‌ మాజీ సీఈఓ అమితాబ్‌ కాంత్‌ ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు. గతంలో ఆమె నీతి ఆయోగ్‌కు సంబంధించిన ఓ ప్రాజెక్టు కోసం పనిచేశారు. బిహేవియరల్‌ సైన్స్‌లో పీహెచ్‌డీ చేయడానికి లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌కు వెళ్లారు. సైక్లింగ్‌ చేస్తుండగా.. జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించారు. చేష్ఠా కొచ్చర్‌ నీతి ఆయోగ్‌లో ‘లైఫ్‌’ ప్రోగ్రాంపై పనిచేశారు. చాలా తెలివైన వ్యక్తి. ధైర్యవంతురాలు. చాలా త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోయారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను’’ అని అమితాబ్‌ కాంత్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. మార్చి 19న ఎల్‌ఎస్‌ఈ నుంచి సైకిల్‌పై ఇంటికి వస్తుండగా.. ఓ ట్రక్కు ఢీకొన్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.వెంటనే వచ్చి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందారు. ఆమె తండ్రి ఎస్‌పీ కొచ్చర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌గా పనిచేశారు

Updated On 25 March 2024 3:46 AM GMT
Ehatv

Ehatv

Next Story