Tending Web Series : ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో దుమ్మురేపుతున్న..ఇండియన్ పోలీస్ ఫోర్స్
ఇండియా టాప్ వెబ్ సిరీస్లో ఇండియన్ పోలీస్ ఫోర్స్ ట్రెండింగ్‌లో ఉంది. యాక్షన్ మూవీస్ స్పెషలిస్ట్..బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి దర్శకత్వంలో వస్తున్న ఈ వెబ్ సిరీస్లో బాలీవుడ్ స్టార్లు సిద్ధార్థ్ మల్హోత్రా, శిల్పా శెట్టి, వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలు పోషించారు. జనవరి 19వ తేదీ నుంచి ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చిన ఇండియన్ పోలీస్ ఫోర్స్ సీజన్ 1 వెబ్ సిరీస్ భారీగా వ్యూస్ దక్కించుకుంటోంది.
ఇండియా టాప్ వెబ్ సిరీస్లో ఇండియన్ పోలీస్ ఫోర్స్ (Indian Police Force) ట్రెండింగ్(Trending)లో ఉంది. యాక్షన్ మూవీస్ స్పెషలిస్ట్..బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి (Director Rohit Shetty) దర్శకత్వంలో వస్తున్న ఈ వెబ్ సిరీస్లో బాలీవుడ్ స్టార్లు (Bollywood stars) సిద్ధార్థ్ మల్హోత్రా (Siddharth Malhotra), శిల్పా శెట్టి ( Shilpa Shetty), వివేక్ ఒబెరాయ్(Vivek Oberoi) ప్రధాన పాత్రలు పోషించారు. జనవరి 19వ తేదీ నుంచి ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చిన ఇండియన్ పోలీస్ ఫోర్స్ సీజన్ 1 వెబ్ సిరీస్ భారీగా వ్యూస్ దక్కించుకుంటోంది. తాజాగా ఆమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ పాపులర్ అవుతోంది. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, ఉర్దూసహా మరిన్ని భాషల్లోనూ స్ట్రీమ్ అవుతోంది. ప్రస్తుతం ఈ సిరీస్‍కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. పోలీస్ యాక్షన్ థ్రిల్లర్తో వచ్చిన ఈ సిరీస్..భారత్‍తో పాటు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బ్రిటన్, యూఏఈ అండ్ సింగపూర్ వంటి దేశాల్లో..టాప్-10 మూవీస్లో ట్రెండ్ అవుతోందని అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. యాక్షన్ లవర్స్తోపాటు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఇండియాలో టాప్ వెబ్ సిరీస్‌లలో ట్రెండ్ అవుతోంది.
ఇండియన్ పోలీస్ ఫోర్స్ సీజన్ 1 వెబ్ సిరీస్ కథ ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్ల చుట్టూ తిరుగుతుంది. దిల్లీ పోలీస్ రైజింగ్ డే రోజున రాజధాని నగరం బాంబు పేలుళ్లతో దద్దరిల్లిపోతుంది. వివిధ ప్రాంతాల్లో జరిగిన పేలుళ్లలో దాదాపు 240 మంది అమాయకులు బలైపోతారు. ఈ పేలుళ్లకు తామే బాధ్యులమంటూ ఇండియన్ ముజాహిదీన్ ప్రకటిస్తుంది.
ఉగ్రవాదులను పట్టుకునే బాధ్యతను ఢిల్లీ పోలీస్ స్పెషల్ యూనిట్ అఫీసర్లు కబీర్ మాలిక్ (సిద్ధార్థ్ మల్హోత్రా), విక్రమ్ భక్షి (వివేక్ ఒబెరాయ్) చేపడతారు. ఇక..టెర్రర్ గ్రూపును పట్టుకునే పనిలో భాగంగా పోలీస్ ఫోర్స్ చేసిన సాహసాలు.. వారు వేసే లాజిక్స్ ఈ సీరీస్‌లో స్పెషల్ హైలెట్స్గా నిలిచాయి. పోలీసులకు ఉగ్రవాదులకు పోరు ఎలా జరిగింది? జరార్‌ను కబీర్ మాలిక్ టీమ్ పట్టుకుందా.. అనేదే అసలు కథగా ఉంది. ఈ ఇండియన్ పోలీస్ ఫోర్స్ సిరీస్‌ను రోహిత్ శెట్టి పిక్చర్స్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించాయి.
they’ve earned the #1 spot (and all our hearts)💙#IndianPoliceForceOnPrime, watch now#RohitShetty @SidMalhotra @TheShilpaShetty @vivekoberoi @itsishatalwar @RSPicturez #SushwanthPrakash @RelianceEnt @TSeries pic.twitter.com/XuIHlpJI3n
— prime video IN (@PrimeVideoIN) January 19, 2024