బ్రిటన్‌లో(Britain) ఓ భారతీయ జంటకు(Indian Couple) చెరో 33 ఏళ్ల జైలు శిక్ష(Jail imprisonment) పడింది. మాదకద్రవ్యాల అక్రమ రవాణా(Drug trafficking) ఆరోపణపై అరెస్టయ్యిన ఈ జంట నానా ఘాతుకాలు చేసింది.

బ్రిటన్‌లో(Britain) ఓ భారతీయ జంటకు(Indian Couple) చెరో 33 ఏళ్ల జైలు శిక్ష(Jail imprisonment) పడింది. మాదకద్రవ్యాల అక్రమ రవాణా(Drug trafficking) ఆరోపణపై అరెస్టయ్యిన ఈ జంట నానా ఘాతుకాలు చేసింది. భార్యభర్తలైన ఆరతీధీర్‌(Aratidhir) (59), కవల్‌జిత్‌ సింహ్‌రాయ్‌ జాదా(Kawaljit Sinhroy Jada) (39) గుజరాత్‌లో ఓ బాలుడిని దత్తతకు తీసుకున్నారు. అతడి పేరిట 1.3 కోట్ల రూపాయల జీవితబీమా చేయించారు. ఈ బీమా డబ్బు కోసం బాలుడిని, అతడి బావను హత్య చేయించారు. ఈ హత్య కేసులో ఆరతి, రాయ్‌ జాదాలను తమకు అప్పగించాలని ఇండియా కోరినప్పటికీ మానవ హక్కుల రక్షణ పేరుతో బ్రిటన్‌ 2020, ఫిబ్రవరిలో ఆ వినతిని తిరస్కరించింది. ఈ మొగుడుపెళ్లాలు బ్రిటన్‌ నుంచి ఆస్ట్రేలియాకు 602 కోట్ల రూపాయల విలువైన 514 కిలోల కొకైన్‌ను అక్రమంగా తరలించారు. ఇప్పుడీ నేరం కోర్టులో రుజువవ్వడంతో జైలు శిక్ష పడింది. హీత్రూ విమానాశ్రయంలో ఓ విమాన రవాణా కంపెనీలు చాలా కాలంపాటు పని చేసిన భార్యభర్తలు 2015లో సొంతంగా కంపెనీ పెట్టుకున్నారు. 2021 జూన్‌ 21వ తేదీన హ్యాన్‌వెల్‌లోని వారి ఇంట్లో పోలీసులు భార్యభర్తలిద్దరినీ అరెస్టు చేశారు. ఆ ఇంట్లోంచి పెద్ద ఎత్తున సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.

Updated On 1 Feb 2024 12:56 AM GMT
Ehatv

Ehatv

Next Story