నరేంద్రమోదీ(Narendra modi) నేతృత్వంలోని ఎన్‌డీఏ(NDA) అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్‌(Petrol), డీజిల్‌(Disel), వంటగ్యాస్‌ ధరలు విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే! ఇప్పుడు ఇంధనాల ధరలు మరింత మంటపెట్టనున్నాయి. అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రభావం భారత్‌పై భారీగానే ఉండబోతున్నాయి. ప్రస్తుతం ఇరాన్‌(Iran)-ఇజ్రాయెల్‌(Israel) మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు క్రూడాయిల్‌(Crude oil) ధరలపై పెను ప్రభావం చూపించబోతున్నాయి. ఇదే జరిగితే మాత్రం మన దేశంలో పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు చుక్కలను దాటిపోవడం ఖాయం. ఏప్రిల్ 1వ తేదీన సినియాలోని(Sinia) ఇరాన్‌ కాన్సులేట్‌పై ఇజ్రాయెల్ దాడి చేసిన విషయం విదితమే కదా! ఈ ఘటన జరిగిందని ఇస్లామిక్‌ రెవల్యూషనరీ గార్డ్స్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జీసీ) కూడా చెప్పింది. ఇరాన్‌ తక్కువతిన్నదా? ఇజ్రాయెల్‌పై అంతకంత ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమయ్యింది.

ఇజ్రాయెల్ సైనిక స్థావరాలే లక్ష్యంగా 300లకు పైగా డ్రోన్లు(Drones), క్షిపణులతో(Missiles) ప్రతీకారదాడులు చేసింది. ఇప్పుడు ఇజ్రాయెల్‌ కూడా కదనరంగంలోకి దిగితే మాత్రం పరిస్థితి భయానకంగా మారుతుంది. ఈ యుద్ధం రెండు దేశాలకే పరిమితం కాదు. మిగతా దేశాలు ఏదో ఒకవైపు నిలవడం అనివార్యమవుతుంది. ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడి చేస్తేనే ముడి చమురు ధరలు అమాంతం పెరిగాయి. నిరుడు అక్టోబర్‌ నుంచి ఇంతగా ఎప్పుడూ పెరగలేదు. ఒకవేళ ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులకు దిగితే అందులో తాము తలదూర్చబోమని అమెరికా అధ్యక్షుడు జో బైడన్‌ స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహుకూ కూడా ఈ విషయాన్ని చెప్పారు. ఇది కూడా చమురు మార్కెట్‌ను ప్రభావితం చేయవచ్చని విశ్లేషకులు అంటున్నారు.

ఇదిలా ఉంటే ఓమన్‌, ఇరాన్‌ మధ్య ఉన్న హార్ముజ్‌ జలసంధి ద్వారా జరిగే రవాణాకు అంతరాయం ఏర్పడితే మాత్రం గ్లోబల్‌ మార్కెట్‌లో ఆయిల్‌ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. ప్రపంచ ముడి చమురు సరఫరాలో దాదాపు 20 శాతం ఈ మార్గం ద్వారానే జరుగుతూ వస్తున్నది. ఇప్పటికే ఇజ్రాయెల్‌తో సబంధాలు ఉన్న ఓ వాణిజ్య నౌకను హార్ముజ్‌ జలసంధిలో ఇరాన్‌ అడ్డుకున్నది. ఈ అడ్డుకోవడాలు ఇక్కడితో ఆగితే మంచిదే కానీ, ఆగకపోతే మాత్రం మనకు గడ్డుకాలమే! మనకు ముడి చమురు సరఫరా తగ్గిపోతుంది. ఒపెక్‌ కూటమి సభ్యదేశాలైన సౌదీ అరేబియా, ఇరాన్‌, యూఏఈ, కువైట్‌ ,ఇరాక్‌ల నుంచి ఈ జలసంధి ద్వారానే పెద్ద ఎత్తున చమురు రవాణా జరుగుతుంది. చమురు రవాణా ఆగిపోతే డిమాండ్‌కు సరిపడా సప్లై ఉండదు.

అప్పుడు ఆటోమాటిక్‌గా ఇంధన ధరలు పెరుగుతాయి. ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగినా, ఉద్రికత్తలు ముదిరి యుద్ధానికి దారి తీసినా బ్యారెల్‌ ముడి చమురు ధర 100 డాలర్లను తాకుతుందని నిపుణులు అంటున్నారు. ఇదిలా ఉంటే లోక్‌సభ ఎన్నికల తర్వాత దేశంలో పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరలు పెరుగడం ఖాయం. ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, రాబోయే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చాలా రోజుల నుంచి కేంద్రం చమురు ధరల పెంపును ఆపుతున్నది. ఎన్నికలు ముగిసిన తర్వాత లీటర్‌ పెట్రోల్ ధర 125 రూపాయలు అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదే జరిగితే ద్రవ్యోల్పణం మళ్లీ చెలరేగిపోయే అవకాశం ఉంటుంది. దీన్ని కట్టడి చేయడానికి రిజర్వ్‌ బ్యాంక్‌ వడ్డీరేట్లను పెంచుతుంది. ఆ పెంపుదల కారణంగా కీలకరంగాలలో స్తబ్దత ఏర్పడుతుంది. జీడీపీ మందగిస్తుంది. మొత్తంమీద భవిష్యత్తు మాత్రం ఆందోళనకరంగానే ఉంది.

Updated On 16 April 2024 12:48 AM GMT
Ehatv

Ehatv

Next Story