పఠాన్‌కోట్(Pathankot) ఉగ్రదాడి సూత్రధారి, భారత్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది షాహిద్ లతీఫ్(Shahid Latif) పాకిస్థాన్‌లో(Pakistan) హత్యకు గురయ్యాడు. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని(Punjab Province) సియాల్‌కోట్(Sialkot) నగరంలోని ఓ మసీదులో గుర్తు తెలియని దుండగులు అతడిని కాల్చిచంపారు.
పఠాన్‌కోట్(Pathankot) ఉగ్రదాడి సూత్రధారి, భారత్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది షాహిద్ లతీఫ్(Shahid Latif) పాకిస్థాన్‌లో(Pakistan) హత్యకు గురయ్యాడు. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని(Punjab Province) సియాల్‌కోట్(Sialkot) నగరంలోని ఓ మసీదులో గుర్తు తెలియని దుండగులు అతడిని కాల్చిచంపారు. 2016లో పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై జరిగిన ఉగ్రవాద దాడికి షాహిద్ లతీఫ్ సూత్రధారి అని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) దర్యాప్తులో తేలింది.
షాహిద్ లతీఫ్ 1993లో ఉగ్రవాద ఆరోపణలపై భారత్‌లో అరెస్టయ్యాడు. అతనిపై విచారణ జరిపి జైలుకు పంపారు. షాహిద్ లతీఫ్ దాదాపు 11 ఏళ్ల పాటు భారతీయ జైలులో బంధించబడ్డాడు. భారత్‌లో శిక్షాకాలం పూర్తయింది. తర్వాత 2010లో బహిష్కరణ విధించగా.. పాకిస్థాన్‌కు వెళ్లిపోయాడు.