బిపోర్‌జాయ్ తుఫాన్(Cyclone Biporjoy) అత్యంత భీకరంగా మారింది. గుజరాత్‌ను(Gujarat) గజగజమని వణికిస్తోంది. ఇవాళ సాయంత్రం నాలుగు గంటల తర్వాత తీరాన్ని దాటనున్న ఈ తుఫాన్ ఇప్పటికే విధ్వంసాన్ని సృష్టించింది. కచ్(Kutch) సమీపంలోని మాండ్వీ-పాకిస్తాన్‌లోని జఖౌ(Jakhau) మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
బిపోర్‌జాయ్ తుఫాన్(Cyclone Biporjoy) అత్యంత భీకరంగా మారింది. గుజరాత్‌ను(Gujarat) గజగజమని వణికిస్తోంది. ఇవాళ సాయంత్రం నాలుగు గంటల తర్వాత తీరాన్ని దాటనున్న ఈ తుఫాన్ ఇప్పటికే విధ్వంసాన్ని సృష్టించింది. కచ్(Kutch) సమీపంలోని మాండ్వీ-పాకిస్తాన్‌లోని జఖౌ(Jakhau) మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ తెలిపింది. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు(stormy winds) వీస్తాయని హెచ్చరించింది. ఈ తుఫాన్ కారణంగా గుజరాత్‌లోని పలు ప్రాంతలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు(Heavy Rains) కురవనున్నాయి. సౌరాష్ట్ర, కచ్ తీరాలలో సాయంత్రం వరకు సముద్రం అల్లకల్లోలంగా ఉండబోతున్నది. ఈ తుఫాన్ స్వల్పంగా బలహీనపడినా గుజరాత్‌కు ముప్పు కలుగుతుంది.
ముందు జాగ్రత్తగా తీర ప్రాంతల్లోని సుమారు 74 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇదిలా ఉంటే, అరేబియా సముద్రంలో ఏర్పడిన వాటిలో ఎక్కువ కాలం కొనసాగిన తుఫాన్ బిపోర్‌జాయే! జూన్ 6వ తేదీన ఏర్పడిన ఈ తుఫాన్ తీరాన్ని తాకిన తర్వాత కూడా మరికొన్ని రోజులు ఉనికిలో ఉంటుది. తుఫాన్ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని సమీప ప్రాంతాలలో 144 సెక్షన్‌ను అమలు చేశారు. ఆలయాలు, కార్యాలయాలు, పాఠశాలలు మూసేశారు. తీర ప్రాంతాలలో హై అలర్ట్‌ను ప్రకటించారు. బిపోర్ జాయ్ తుపాను ప్రభావంతో గుజరాత్‌తోపాటు మరో ఎనిమిది రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశముంది. కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గోవా రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాలైన డమన్ దీవ్, లక్షద్వీప్, దాద్రానగర్ హవేలీ అప్రమత్తమయ్యాయి.