Mehul Prajapati : యూ ట్యూబ్ వీడియోలు చేస్తున్నారా? అయితే జాగ్రత్త!
ఈమధ్యన సైడ్ ఇన్‌కమ్ కోసం యూట్యూబ్(Youtube) వీడియోలో చేసుకుంటున్నారు కొందరు. కొందరికేమో అదే జీవనోపాధి అవుతోంది. విదేశాలకు వెళ్లిన ఇండియన్స్‌లో కొందరు అదనపు సంపాదన కోసం యూట్యూబ్ వీడియోలు చేసుకుంటున్నారు. ఇక్కడి వరకు ఓకేనే! కాకపోతే ఏది పడితే అది తీయకూడదు. స్థానిక చట్టాలు, సంస్థల గురించి తెలుసుకోకుండా వీడియోలు తీస్తే మాత్రం ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది.
ఈమధ్యన సైడ్ ఇన్‌కమ్ కోసం యూట్యూబ్(Youtube) వీడియోలో చేసుకుంటున్నారు కొందరు. కొందరికేమో అదే జీవనోపాధి అవుతోంది. విదేశాలకు వెళ్లిన ఇండియన్స్‌లో కొందరు అదనపు సంపాదన కోసం యూట్యూబ్ వీడియోలు చేసుకుంటున్నారు. ఇక్కడి వరకు ఓకేనే! కాకపోతే ఏది పడితే అది తీయకూడదు. స్థానిక చట్టాలు, సంస్థల గురించి తెలుసుకోకుండా వీడియోలు తీస్తే మాత్రం ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది. ఉద్యోగాలు ఊడినా ఊడొచ్చు. సామాను సర్దేసుకుని స్వదేశానికి తిరిగిరావాల్సిన పరిస్థితి వచ్చినా రావొచ్చు! ఇండియాకు చెందిన మేహుల్ ప్రజాపతి(Mehul Prajapati) అనే వ్యక్తి కెనడాకు వెళ్లి అక్కడి ప్రముఖ టీడీ బ్యాంక్‌లో(TD Bank) డేటా సైంటిస్టుగా ఉద్యోగం చేసుకుంటున్నాడు. తీరిక సమయాలలో కెనడా దేశం గురించి, అక్కడి సదుపాయాల గురించి వీడియోలు తీసి యూట్యూబ్‌లో షేర్ చేస్తుంటాడు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ, కెనడాలో డబ్బును ఎలా ఆదా చేసుకోవచ్చో వివరిస్తూ ఓ వీడియో చేశాడు.
అంతే ఉద్యోగం ఊడింది. మరో ఉద్యోగం దొరక్క ఇండియాకు తిరిగి వచ్చే ప్రయత్నాల్లో ఉన్నాడు. అతడి ఏడాది జీతం 81 లక్షల రూపాయలు. అవి సరిపోకపోవడంతో డబ్బులను ఎలా ఆదా చేయవచ్చో వివరించాడు. విద్యార్థులకు ఉచితంగా ఆహారం అందించే ఫుడ్ బ్యాంకులు(Free food banks) ఉంటాయి. ఆ ఫుడ్ బ్యాంకుల నుంచి విద్యార్థులు ఆహారాన్ని ఉచితంగా పొందవచ్చు. ఆ ఫుడ్డును తాను ప్రతి నెల తెచ్చుకుంటున్నానని, తద్వారా ఆహారం, కిరాణా సామాన్ల ఖర్చు తగ్గిందని ప్రజాపతి వీడియోలో చెప్పుకొచ్చాడు. మరో వీడియోలో తాను వారానికి సరిపడ ఆహారాన్ని ఉచితంగా తెచ్చుకున్నానని, వాటిల్లో పండ్లు, కూరగాయలు, బ్రెడ్, సాస్, పాస్తా, క్యాన్డ్ వెజటబుల్స్ ఉన్నాయని వివరించాడు. ఆ వీడియో చూసిన టీడీ బ్యాంక్ అధికారులు ప్రజాపతిపై చర్యలు తీసుకున్నారు.
స్వచ్ఛంద సంస్థలు, ట్రస్టులు, చర్చిల ద్వారా కాలేజీల్లో, యూనివర్సిటీల్లో ఏర్పాటు చేసిన ఫుడ్ బ్యాంక్‌ల నుంచి తీసుకురావడం తప్పని చెప్పారు. కెనడాలో ఉంటూ విద్యార్ధుల కోసం ఏర్పాటు చేసిన ఫుడ్ బ్యాంకుల్లో ఆహారాన్ని ఎలా తీసుకుంటారని ప్రజాపతిని నిలదీశారు. ఏడాది సుమారు 80లక్షల జీతం తీసుకుంటున్న మీరు ఫుడ్ బ్యాంక్‌ల నుంచి ఆహారం తీసుకోవడం సరైంది కాదని వార్నింగ్ ఇస్తూ అతడిని విధుల నుంచి తొలగించారు.