డిమాండ్ల సాధన కోసం ఢిల్లీ(Delhi) చలో పేరిట ఆందోళన చేస్తున్న రైతులతో(Farmers) కేంద్ర ప్రభుత్వం నాలుగో విడద చర్చలు జరిపింది. ఆదివారం రాత్రి 8.15 గంటలకు మొదలైన ఈ చర్చలు సోమవారం తెల్లవారుజామున ఒంటిగంట వరకు కొనసాగాయి. ప్రభుత్వం తరఫున వ్యవసాయశాఖ మంత్రి అర్జున్‌ ముండా(Arjun Munda), వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయెల్‌(Piyush Goyal), హోమ్‌ శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్‌(Nityanad Roy) రైతు నేతలతో చర్చలు జరిపారు. పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

డిమాండ్ల సాధన కోసం ఢిల్లీ(Delhi) చలో పేరిట ఆందోళన చేస్తున్న రైతులతో(Farmers) కేంద్ర ప్రభుత్వం నాలుగో విడద చర్చలు జరిపింది. ఆదివారం రాత్రి 8.15 గంటలకు మొదలైన ఈ చర్చలు సోమవారం తెల్లవారుజామున ఒంటిగంట వరకు కొనసాగాయి. ప్రభుత్వం తరఫున వ్యవసాయశాఖ మంత్రి అర్జున్‌ ముండా(Arjun Munda), వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయెల్‌(Piyush Goyal), హోమ్‌ శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్‌(Nityanad Roy) రైతు నేతలతో చర్చలు జరిపారు. పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం తర్వాత పీయూష్‌ గోయెల్‌ మీడియాతో మాట్లాడారు. రైతులతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత అయిదేళ్లపాటు పప్పు ధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటలను ప్రభుత్వ ఏజెన్సీలు కనీస మద్దతు ధర (MSP) కు కొనుగోలు చేస్తాయని తమ బృందం ప్రతిపాదించినట్లు పీయూష్‌ తెలిపారు. కందులు, మినుములు, మైసూర్‌ పప్పు, మొక్కజొన్న పండించే సాగుదారులతో ఎన్‌సీసీఎఫ్‌, ఎన్‌ఏఎఫ్‌ఈడీ వంటి సహకార సంఘాలు ఒప్పందం కుదుర్చు కుంటాయన్నారు. కొనుగోలు చేసే పరిమాణంపై ఎటువంటి పరిమితి ఉండదని, ఇందుకోసం ఒక పోర్టల్ కూడా అభివృద్ధి చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై రైతు నేత శర్వాన్‌ సింగ్‌ పంథేర్‌ స్పందించారు. దీనిపై సోమ, మంగళవారాల్లో తమ సంఘాలతో చర్చిస్తామన్నారు. నిపుణుల అభిప్రాయాలు కూడా తీసుకొని ఒక నిర్ణయానికి వస్తామని తెలిపారు. రుణమాఫీ వంటి డిమాండ్లు ఇంకా అపరిష్కృతం గానే ఉన్నాయన్నారు. దీనిపై రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని చెప్పారు. ప్రస్తుతానికి ఢిల్లీ చలో కార్యక్రమాన్ని నిలిపి వేశామని, ఒకవేళ తమ డిమాండ్లన్నింటికీ పరిష్కారం లభించకపోతే ఫిబ్రవరి 21న తిరిగి ప్రారంభిస్తామని శర్వాన్‌ సింగ్‌ పంథేర్‌ అన్నారు.

Updated On 19 Feb 2024 2:06 AM GMT
Ehatv

Ehatv

Next Story