భారతదేశంలో(India) చాలా కాలంగా బంగారం(Gold) సంపద, సంప్రదాయం, సాంస్కృతిక ప్రాముఖ్యతకు చిహ్నంగా ఉంది.
భారతదేశంలో(India) చాలా కాలంగా బంగారం(Gold) సంపద, సంప్రదాయం, సాంస్కృతిక ప్రాముఖ్యతకు చిహ్నంగా ఉంది. ముఖ్యంగా బంగారు ఆభరణాలతో మహిళలకు ఎనలేని అనుబంధం ఉంటుంది. ముఖ్యంగా వివాహాల్లో(Marriages) ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇక్కడ బంగారం ప్రతి సంప్రదాయంలో ముఖ్యమైన భాగం. బంగారం బహుమతి లేకుండా ఏ భారతీయ వివాహమూ జరగదు. భారతీయ స్త్రీలకు బంగారం పట్ల దీర్ఘకాలంగా ఉన్న అనుబంధం ఉంటుంది. తరతరాల ద్వారా ఇది మహిళలకు సంక్రమిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా మన దేశంలోని మహిళల దగ్గరే అత్యధికంగా బంగారం ఉన్నట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్(World gold council) నివేదిక వెల్లడించింది. మన దేశ మహిళల దగ్గర దాదాపు 24 వేల టన్నుల బంగారం కలిగి ఉంది. ఇది ప్రపంచంలోని మొత్తం బంగారు నిల్వలలో 11% ఆభరణాల రూపంలో ఉంది. భారతీయ మహిళలు ధరించే బంగారం మొత్తం టాప్ 5 దేశాల్లోని బంగారు నిల్వల కంటే ఎక్కువగా ఉంది.
యునైటెడ్ స్టేట్స్ వద్ద మొత్తం 8,000 టన్నుల బంగారం నిల్వ ఉంది, జర్మనీలో 3,300 టన్నులు, ఇటలీలో 2,450 టన్నుల బంగారం ఉంది. ఫ్రాన్స్ వద్ద 2,400 టన్నులు, రష్యా వద్ద 1,900 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. ఈ దేశాల బంగారు నిల్వలను కలిపినా మన భారతీయ మహిళలకు చెందిన బంగారంతో పోల్చితే చాలా తక్కువ.
ఆక్స్‌ఫర్డ్ గోల్డ్ గ్రూప్ నివేదిక ప్రకారం ప్రపంచంలోని బంగారంలో 11% భారతీయ కుటుంబాలు కలిగి ఉన్నాయని, ఇది USA, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF), స్విట్జర్లాండ్, జర్మనీల సంయుక్త నిల్వల కంటే అధికమని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా, USA అతిపెద్ద అధికారిక బంగారు నిల్వలను కలిగి ఉంది, మొత్తం 8,133.5 టన్నులు, ఇది దేశం యొక్క విదేశీ నిల్వలలో 75%, ఆర్థిక వ్యవస్థ మరియు మార్కెట్ల నివేదిక ప్రకారం. జర్మనీ 3,359.1 టన్నులతో రెండవ స్థానంలో ఉంది, ఇది ఇటీవలి సంవత్సరాలలో జర్మన్లు బంగారంపై గణనీయమైన పెట్టుబడులను పెట్టారు. ముఖ్యంగా బంగారం కొనుగోళ్లలో జర్మనీ కూడా ప్రపంచవ్యాప్తంగా ముందుంది. 2,451.8 టన్నుల బంగారంతో ఇటలీ మూడో స్థానంలో ఉంది. ఇప్పుడు ఈ మూడు దేశాల్లో ఉన్న బంగారం నిల్వలకంటే భారతదేశ మహిళల వద్ద ఉన్న బంగారమే చాలా ఎక్కువ అని నివేదిక వెల్లడించింది.