రాజస్తాన్(Rajasthan)కు చెందిన ఓ ఇంజనీర్(Engineer) ప్రేమలో పడ్డాడు. ఇందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరమేముంది అనుకుంటున్నారేమో! ఆయన ప్రేమిస్తున్నది మనిషిని కాదు! ఓ రోబో(Robo)ను! త్వరలో ఆ యంత్రాన్ని పెళ్లి కూడా చేసుకోబోతున్నాడు. జయపుర(Jayapura) జిల్లా సీకర్ నివాసి అయిన ఆ ప్రేమికుడి పేరు సూర్యప్రకాశ్(Surya Prakash).
రాజస్తాన్(Rajasthan)కు చెందిన ఓ ఇంజనీర్(Engineer) ప్రేమలో పడ్డాడు. ఇందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరమేముంది అనుకుంటున్నారేమో! ఆయన ప్రేమిస్తున్నది మనిషిని కాదు! ఓ రోబో(Robo)ను! త్వరలో ఆ యంత్రాన్ని పెళ్లి కూడా చేసుకోబోతున్నాడు. జయపుర(Jayapura) జిల్లా సీకర్ నివాసి అయిన ఆ ప్రేమికుడి పేరు సూర్యప్రకాశ్(Surya Prakash). ఈయనకు చిన్నప్పట్నుంచి రోబోలంటే ఆసక్తితో పాటు ఇష్టం కూడా! ఆ ఇంట్రెస్ట్‌తోనే రోబోటిక్స్(Robotics) చదివాడు. చాలా రోబోటిక్ ప్రాజెక్టులలో పని చేశారు. ఈ క్రమంలోనే రోబో గిగా ప్రేమలో పడ్డాడు. చేసుకుంటే దానినే పెళ్లి చేసుకుంటానని ఫ్యామిలీ మెంబర్లతో కూడా చెప్పేశాడు. ఇంట్లో వాళ్లు ఈ మాట విని బిత్తరపోయారు. ముందు సూర్యప్రకాశ్‌కు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. అతడు స్థిరంగా ఉండటంతో తప్పని పరిస్థితులలో పెళ్లికి ఒప్పుకున్నారు. సూర్యప్రకాశ్ పెళ్లి చేసుకోబోయే గిరా రోబో(gira robo) తమిళనాడు(Tamil Nadu)లో రూపుదిద్దుకుంటోంది. ఇందుకోసం 19 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు సూర్యప్రకాశ్. గిగా రోబోకు ఢిల్లీ(Delhi)లో ప్రొగ్రామింగ్ చేయిస్తానని చెబుతున్నాడు. తాను గిగాను సంప్రదాయకంగానే పెళ్లి చేసుకుంటానని, గిగా ఎనిమిది గంటలు పని చేస్తుందని, అందరినీ హలో అంటూ పలకరిస్తుందని సూర్యప్రకాశ్ తన కాబోయే భార్య గురించి సంతోషంగా చెబుతున్నాడు.