Trekking Death In Austarlia : ప్రాణం తీసిన ట్రెక్కింగ్ సరదా.. ఆస్ట్రేలియాలో తెలుగు వైద్యురాలు మృతి..!
ఆస్ట్రేలియాలో(Autralia) తెలుగు వైద్యురాలు ప్రమాదవశాత్తు మృతి చెందింది. ట్రెక్కింగ్(Trekking) సరదా మృత్యువును కొనితెచ్చింది. ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లాకు చెందిన వేమూరు ఉజ్వల అనే వైద్యురాలు ఈనెల 2న స్నేహితులతో కలిసి సరదాగా ట్రెక్కింగ్‌కు వెళ్లింది. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ బాండ్ యూనివర్సిటీలో(Bond University of Queensland) ఉజ్వల ఎంబీబీఎస్ పూర్తి చేసింది.

Trekking Death In Austarlia
ఆస్ట్రేలియాలో(Autralia) తెలుగు వైద్యురాలు ప్రమాదవశాత్తు మృతి చెందింది. ట్రెక్కింగ్(Trekking) సరదా మృత్యువును కొనితెచ్చింది. ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లాకు చెందిన వేమూరు ఉజ్వల అనే వైద్యురాలు ఈనెల 2న స్నేహితులతో కలిసి సరదాగా ట్రెక్కింగ్‌కు వెళ్లింది. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ బాండ్ యూనివర్సిటీలో(Bond University of Queensland) ఉజ్వల ఎంబీబీఎస్ పూర్తి చేసింది. రాయల్ బ్రిస్బేన్ మహిళా ఆస్పత్రిలో(Royal Brisbane Women's Hospital) పనిచేస్తున్న ఉజ్వల(Ujwala).. ఈనెల 2న సరదాగా స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్ వెళ్లింది. ట్రెక్కింగ్ చేస్తూ కాలు జారి లోయలో పడి మరణించింది. దీంతో ఉజ్వల కుటుంబంలో విషాదం నెలకొంది. ఆస్ట్రేలియాలోనే ఉంటున్న ఉజ్వల తల్లిదండ్రులు వేమూరి మైథిలి, వెంకటేశ్వరరావు.. అంత్యక్రియల కోసం స్వస్థలానికి మృతదేహాన్నితరలిస్తున్నారు. ఉంగటూరు మండలం ఎలుకపాడులోని అమ్మమ్మ, తాతయ్య ఇంటికి తరలించి అక్కడే అంత్యక్రియలు జరపనున్నారు.
