చైనా(China) నుంచి అరేబియా(arabia) సముద్రం మీదుగా యునైటెడ్ అరబ్‌ ఎమిరేట్స్‌కు(United Arab Emirates) ఓ నౌక(ship) బయలుదేరింది. పనమా పతాకంతో ఉన్న ఆ ఎంవీ డాంగ్‌ ఫాంగ్‌ కాన్‌టాన్‌ నంబర్‌ 2(MV Dong Fang Canton No. 2) రీసర్చ్‌ నౌక గమ్యం వైపుకు సాగుతోంది. ఇందులో ఆ నౌకలో పని చేస్తున్న యిన్‌ వీగ్‌యాంక్‌కు(Yin Weiyank) గుండెనొప్పి(Heart attack) వచ్చింది. నొప్పితో పాపం అతడు విలవిలలాడిపోయాడు.

చైనా(China) నుంచి అరేబియా(arabia) సముద్రం మీదుగా యునైటెడ్ అరబ్‌ ఎమిరేట్స్‌కు(United Arab Emirates) ఓ నౌక(ship) బయలుదేరింది. పనమా పతాకంతో ఉన్న ఆ ఎంవీ డాంగ్‌ ఫాంగ్‌ కాన్‌టాన్‌ నంబర్‌ 2(MV Dong Fang Canton No. 2) రీసర్చ్‌ నౌక గమ్యం వైపుకు సాగుతోంది. ఇందులో ఆ నౌకలో పని చేస్తున్న యిన్‌ వీగ్‌యాంక్‌కు(Yin Weiyank) గుండెనొప్పి(Heart attack) వచ్చింది. నొప్పితో పాపం అతడు విలవిలలాడిపోయాడు. నౌక నడి సముద్రంలో ఉండటంతో సిబ్బందికి ఏం చేయాలో పాలుపోలేదు. సమీప తీర ప్రాంతమైన ముంబాయిలోని మారిటైమ్‌ రెస్క్యూ కో ఆర్డినేషన్ సెంటర్‌కు అత్యవసర సందేశం పంపారు. ఆ సందేశాన్ని చూసి భారత కోస్ట్‌గార్డ్‌(Bharath coast Gaurd) వెంటనే రియాక్టయ్యింది.

బాధితుడిని రక్షించడానికి కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది ఏఎల్‌హెచ్‌ఎంకే-3(ALPHMK-3) హెలికాఫ్టర్‌తో బయలుదేరారు. ఆ సమయానికి నౌక ఆరేబియా సముద్ర తీరానికి దాదాపు రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది. వాతావరణ పరిస్థితులు ఏ మాత్రం అనుకూలంగా లేవు. ఏమైనా జరగవచ్చు. అయినప్పటికీ కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది వెనకడుగు వేయలేదు. ధైర్యంగా ముందుకు సాగింది. ఆ చిమ్మ చీకట్లోనే ఆపరేషన్‌ చేపట్టింది. అర్థరాత్రి సమయంలో నౌకలోంచి వీగ్‌యాంగ్‌ను ఎయిర్‌లిఫ్ట్‌ చేసింది. హెలికాఫ్టర్‌లోనే ప్రథమ చికిత్స అందించింది. తర్వాత ఆయనను సమీప ఆసుపత్రిలో చేర్పించింది. ఇప్పుడు ఆ చైనీయుడు గండం నుంచి బయటపడ్డాడు.

Updated On 17 Aug 2023 3:18 AM GMT
Ehatv

Ehatv

Next Story