Indian Army : చొరబాటుకు ఉగ్రవాదుల యత్నం... అడ్డుకున్న భారత ఆర్మీ
అంతర్జాతీయ సరిహద్దు(International Border) నుంచి మన దేశంలోకి(India) చొరబడేందుకు ఉగ్రవాదులు(Terrorists) చేసిన ప్రయత్నాన్ని భారత సైన్యం(Indian Army) అడ్డుకుంది. ఆయుధాలు ధరించిన నలుగురు ఉగ్రవాదులు శుక్రవారం అర్ధరాత్రి జమ్ములోని(Jammu) అక్నూర్(Aknoor) సెక్టార్ దగ్గర సరిహద్దు దాటడానికి ప్రయత్నించారు.

Indian Army
అంతర్జాతీయ సరిహద్దు(International Border) నుంచి మన దేశంలోకి(India) చొరబడేందుకు ఉగ్రవాదులు(Terrorists) చేసిన ప్రయత్నాన్ని భారత సైన్యం(Indian Army) అడ్డుకుంది. ఆయుధాలు ధరించిన నలుగురు ఉగ్రవాదులు శుక్రవారం అర్ధరాత్రి జమ్ములోని(Jammu) అక్నూర్(Aknoor) సెక్టార్ దగ్గర సరిహద్దు దాటడానికి ప్రయత్నించారు. వీరిని గుర్తించిన మన సూనికులు కాల్పులు జరిపారు. కాల్పులలో ఒక ఉగ్రవాది అక్కడికక్కడే చనిపోయాడు. మిగతావారు వెనక్కి వెళ్లిపోయారు.అయితే చనిపోయిన ఉగ్రవాది మృతదేహాన్ని మిగిలిన వారు తమ వెంటే లాక్కెళ్లిపోయారని ఆర్మీ అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని అడ్డుకున్నామని, నలుగురిలో ఒకరిని కాల్చి చంపామని, మిగిలిన ముగ్గరు చనిపోయిన ఉగ్రవాది మృతదేహాన్ని లాక్కెళ్లడాన్ని గమనించామని ఆర్మీకి చెందిన వైట్‌నైట్ కార్ప్స్ ఎక్స్ (ట్విట్టర్) తెలిపింది.
