ఛత్తీస్‌గఢ్‌లో(Chhattisgarh) నక్సలైట్లు(Naxalites) దారుణ ఘటనకు పాల్పడ్డారు. దంతేవాడ(Dantewada)లోని అరన్‌పూర్‌లో(Aranpur) జిల్లా రిజర్వ్ గార్డ్(Reserve Guard) (డిఆర్‌జి) సైనికులపై నక్సలైట్లు మెరుపుదాడి చేశారు.

ఛత్తీస్‌గఢ్‌లో(Chhattisgarh) నక్సలైట్లు(Naxalites) దారుణ ఘటనకు పాల్పడ్డారు. దంతేవాడ(Dantewada)లోని అరన్‌పూర్‌లో(Aranpur) జిల్లా రిజర్వ్ గార్డ్(Reserve Guard) (డిఆర్‌జి) సైనికులపై నక్సలైట్లు మెరుపుదాడి చేశారు. ఈ దాడిలో 11 మంది జవాన్లు వీరమరణం పొందినట్లు వార్తలు వస్తున్నాయి. జవాన్ల(Javan) వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని నక్సలైట్లు ఐఈడీని పేల్చినట్లు సమాచారం. సమాచారం అందుకున్న తర్వాత ఆ ప్రాంతానికి అదనపు పోలీసు బలగాలను పంపించారు. మృతుల్లో 10 మంది డీఆర్‌జీ సిబ్బంది, ఓ డ్రైవర్‌ ఉన్నారు. నక్సలైట్ల ఘటనపై సీఎం భూపేష్ బఘేల్ స్పందించారు. ఘ‌ట‌న‌ చాలా బాధాకరం.. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.. పోరాటం చివరి దశలో ఉంది.. నక్సలైట్లను వదిలిపెట్టబోమని సీఎం అన్నారు.

Updated On 26 April 2023 4:55 AM GMT
Ehatv

Ehatv

Next Story