NCERT : ఇక నుంచి పాఠ్యపుస్తకాలలో ఇండియాకు బదులు భారత్!
ఇక ఎన్‌సీఆర్‌ఆర్‌టీ పాఠ్య పుస్తకాలలో(NCERT Text Books) ఇండియా(INDIA) అనే పదం కనిపించదు. ఇండియా అనే పదానికి బదులుగా భారత్(BHARATH) అనే పదాన్ని చేర్చాలనే ప్రతిపాదనకు జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (NCERT) ఆమోద ముద్ర వేసింది. ఈ ప్రతిపాదనను అంతటా అమలు చేయాలని కోరుతూ సిఫారసు చేయబోతున్నది.
ఇక ఎన్‌సీఆర్‌ఆర్‌టీ పాఠ్య పుస్తకాలలో(NCERT Text Books) ఇండియా(INDIA) అనే పదం కనిపించదు. ఇండియా అనే పదానికి బదులుగా భారత్(BHARATH) అనే పదాన్ని చేర్చాలనే ప్రతిపాదనకు జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (NCERT) ఆమోద ముద్ర వేసింది. ఈ ప్రతిపాదనను అంతటా అమలు చేయాలని కోరుతూ సిఫారసు చేయబోతున్నది.చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రతిపాదనకు ఇప్పుడు ఆమోదముద్ర లభించింది. సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్టు ప్యానల్ ఛైర్మన్ ఐజాక్(Isaac) తెలిపారు. కొత్త ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో ఇండియా బదులు భారత్ ఉంటుందని చెప్పారు. ఎన్‌సీఈఆర్‌టీ తరపున అన్ని పుస్తకాల్లో ఈ మార్పు రాబోతుందని ప్యానెల్ ఆశిస్తున్నట్లు ఐజాక్ అన్నారు. అలాగే పాఠ్య పుస్తకాల్లో ప్రాచీన చరిత్రకు బదులు, పురాతన చరిత్ర(Ancient History), ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టాలని కూడా ప్యానెల్ సిఫార్సు చేసినట్లు తెలిపారు. ఇదిలా ఉంటే వివిధ పోరాటాల్లో హిందూ విజయాలను పాఠ్యపుస్తకాల్లో హైలైట్ చేయాలని కూడా కమిటీ సిఫార్సు చేసినట్లు ఆయన తెలిపారు. చరిత్రలో ఇప్పటిదాకా మన ఓటముల ప్రస్తావనే ఉంది. కానీ, మొఘలుల మీద, సుల్తానుల మీద మన విజయాల గురించి ప్రస్తావన లేదు అని ఐజాక్ చెప్పుకొచ్చారు.