అమెరికాకు(America) వెళ్లి చదువుకోవాలి.. అక్కడే ఏదో ఉద్యోగం చూసుకోవాలి. బోల్డంత సంపాదించాలి. జీవితంలో స్థిరపడాలి.. ఇలాంటి కోరికలు సగటు భారతీయ యువతకు ఉండటం సర్వసాధారణం. ఇప్పుడు ఎవరిని అడిగినా తమ టార్గెట్‌ అమెరికా అనే అంటున్నారు. ఇంతకు ముందంటే ఏమో అనుకోవచ్చు కానీ ఇప్పుడు అమెరికాలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. డాలర్‌ డ్రీమ్స్‌ చెదిరిపోతున్నాయి.

అమెరికాకు(America) వెళ్లి చదువుకోవాలి.. అక్కడే ఏదో ఉద్యోగం చూసుకోవాలి. బోల్డంత సంపాదించాలి. జీవితంలో స్థిరపడాలి.. ఇలాంటి కోరికలు సగటు భారతీయ యువతకు ఉండటం సర్వసాధారణం. ఇప్పుడు ఎవరిని అడిగినా తమ టార్గెట్‌ అమెరికా అనే అంటున్నారు. ఇంతకు ముందంటే ఏమో అనుకోవచ్చు కానీ ఇప్పుడు అమెరికాలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. డాలర్‌ డ్రీమ్స్‌ చెదిరిపోతున్నాయి. కోవిడ్‌ తర్వాత పరిస్థితులు చాలా మారాయి. గత కొన్ని సంవత్సరాలుగా టెక్నాలజీ రంగం జాబ్‌ మార్కెట్‌లో నత్తనడక నడుస్తున్నది. కాలేజీ ట్యూషన్‌ ఫీజులు కూడా విపరీతంగా పెరిగాయి. డాలర్‌(Dollar) రేటు పెరిగింది. రూపాయి పడిపోయింది. చదువు కోసం తీసుకున్న అప్పులకు వడ్డీలు పెరిగాయి. అందుకే ఇప్పుడు చాలా మంది అమెరికా అంటే భయపడిపోతున్నారు. చదువుకోవడానికి అక్కడి వరకు వెళ్లడం ఎందుకని అనుకుంటున్నారు. ఉన్నత విద్య కోసం ఇంత దూరం రానవసరం లేదని అమెరికాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా అమెరికా కల నెరవేర్చుకునేందుకు రుణాలు(Loan) చేసి మరీ మాస్టర్‌ డిగ్రీ పొందాలనుకుంటున్న విద్యార్థులు ఆలోచించుకుంటే మంచిదని చెబుతున్నారు. అమెరికాలో ఉంటున్న భారతీయ విద్యార్థులు సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు చూస్తుంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. ‘అమెరికాలో టెక్‌ ఉద్యోగాల బంగారుకలలు ఛిద్రమవుతున్నాయి. మీరు డిగ్రీ పట్టుకొని ఈ పరిస్థితుల్లో అమెరికా రావాలనుకొంటే సమయం, డబ్బు వృథా చేసుకోవడమే తప్ప ఏమీ ఉండదు. అధిక ఫీజులు, తక్కువ వేతనాలు, లాటరీలో హెచ్‌1బీ వీసా పొందే అవకాశం స్వల్పంగా ఉండటం.గ్రీన్‌కార్డు పొందే అవకాశం లేకపోవడమే ఇందుకు కారణం’ అంటూ ఓ ఇండియన్‌ స్టూడెంట్‌ పోస్ట్‌ పెట్టారు. 'లక్షలాది మంది ఎంఎస్‌ కోసం అమెరికా వస్తున్నారు. కోర్సు పూర్తయిన తర్వాత అందరికీ ఉద్యోగాలు రావడం అనేది కలే' మరొకరు పోస్ట్‌ చేశారు. నిరుద్యోగం ప్రబలుతోందనీ, వేతనాలు తక్కువగా ఉంటున్నాయని, ఈ పరిస్థితి మరో రెండు మూడేళ్లు ఉండవచ్చని మరొకరు చెబుతున్నారు. అమెరికాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను ఇక్కడి విద్యార్థులు అర్థం చేసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా కంపెనీలలో కొనసాగుతున్న లేఆఫ్‌లతో కోర్సుల ఎంపిక విషయంలో పునరాలోచన చేస్తున్నారు. సంప్రదాయ రంగాలవైపు చూస్తున్నారు. ఎందుకొచ్చిన టెక్‌ రంగమనుకుంటూ మైనింగ్‌, సివిల్‌, రోబోటిక్స్‌, మెకాట్రోనిక్స్‌ రంగాలపై ఆసక్తి చూపుతున్నారు.

Updated On 10 Feb 2024 2:11 AM GMT
Ehatv

Ehatv

Next Story