దేశంలో గడిచిన 24 గంటల్లో 10,112 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి. శనివారంతో పోలిస్తే ఆదివారం కేసులు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 67,806కి చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది.
దేశంలో గడిచిన 24 గంటల్లో 10,112 కొత్త కొవిడ్ కేసులు(Covid Cases) నమోదయ్యాయి. శనివారంతో పోలిస్తే ఆదివారం కేసులు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల(Active Cases) సంఖ్య 67,806కి చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ(Union Health Ministry) ఆదివారం తెలిపింది. 24 గంటల్లో 9,833 మంది మహమ్మారి నుంచి రికవరీ అయ్యారు. ఆరోగ్య శాఖ డేటా ప్రకారం.. ఢిల్లీ(Delhi)లో 1,515 కోవిడ్ ఇన్‌ఫెక్షన్లు నమోదయ్యాయి. 26.46 పాజిటివిటీ రేటు(Positivity Rate) ఉండగా.. ఆరు మరణాలు నమోదయ్యాయి. మహారాష్ట్ర(Maharastra)లో 850 కొత్త కరోనా కేసులు నమోదవ్వగా.. నాలుగు మరణాలు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ పేర్కొంది.
ఉత్తరప్రదేశ్(Uttarpradesh), తమిళనాడు(Tamilnadu), మహారాష్ట్రతో సహా ఎనిమిది రాష్ట్రాలను కొవిడ్‌ను కఠినంగా పర్యవేక్షించాలని కేంద్రం అలర్ట్ చేసింది. మహమ్మారిని నియంత్రించడానికి ముందస్తు చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను శుక్రవారం కేంద్రం కోరింది. కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్.. కోవిడ్ ఇంకా తగ్గలేదని.. ఏ స్థాయిలోనైనా అలసత్వం వహించకుండా జాగ్రత్తగా ఉండాలని ఉత్తరప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్(Rajasthan), మహారాష్ట్ర, కేరళ(Kerala), కర్ణాటక(Karnataka), హర్యానా(Haryana), ఢిల్లీకి రాసిన లేఖలో కోరారు.