దేశంలో గడిచిన 24 గంటల్లో 7,663 కొత్త కరోనా కేసులు(Corona Cases) నమోదయ్యాయి. మరో 11 మంది మరణించారని మంగళవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ(Health Ministry) విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది. గత 24 గంట్టో 6,702 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం యాక్తివ్ కేసుల సంఖ్య 61,233కి చేరుకుంది. ఉదయం 8 గంటల వరకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం.. గత 24 గంటల్లో కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా 11 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం మరణాల(Corona Deaths) సంఖ్య 5,31,152 కు పెరిగింది.
దేశంలో గడిచిన 24 గంటల్లో 7,663 కొత్త కరోనా కేసులు(Corona Cases) నమోదయ్యాయి. మరో 11 మంది మరణించారని మంగళవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ(Health Ministry) విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది. గత 24 గంట్టో 6,702 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం యాక్తివ్ కేసుల సంఖ్య 61,233కి చేరుకుంది.
ఉదయం 8 గంటల వరకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం.. గత 24 గంటల్లో కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా 11 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం మరణాల(Corona Deaths) సంఖ్య 5,31,152 కు పెరిగింది. ఢిల్లీ(Delhi), కేరళ(Kerala)లో రాష్ట్రాలలో నాలుగేసి మరణాలు నమోదవగా.. హర్యానా(haryana), కర్ణాటక(Karnataka), పంజాబ్(Punjab)లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. తాజా ఇన్ఫెక్షన్‌లతో దేశంలో ఇప్పటివరకూ కోవిడ్ కేసుల(Covid Cases) సంఖ్య 4.47 కోట్లు (4,48,34,859)కు చేరింది.
మొత్తం సోకిన వారిలో 0.14 శాతం యాక్టివ్ కేసులు(Active Cases) ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. జాతీయ కోవిడ్-19 రికవరీ రేటు(Recovery Rate) 98.68 శాతంగా నమోదైంది. వ్యాధి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య 4,42,42,474 కు పెరిగింది. మరణాల రేటు 1.18 శాతంగా ఉంది. మంత్రిత్వ శాఖ ప్రకారం.. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 220.66 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్(Covid Vaccine)లు ఇవ్వబడ్డాయి.