దేశంలో మళ్లీ కరోనా కేసులు(Corona Case) ఆందోళన కలిగిస్తున్నాయి. కొత్తగా 142 కేసులు నమోదైనట్లు, కర్నాటకలో(Karnataka) ఒకరు మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ(Union Health Ministry) వెల్లడించింది. యాక్టివ్ కేసుల(Active Cases) సంఖ్య 1,970కి చేరింది. నిన్న కేరళ(Kerala) లో ఐదుగురు, యూపీ(UP) లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో కరోనా మృతుల సంఖ్య ఏడు కు చేరింది.

Active Corona Cases
దేశంలో మళ్లీ కరోనా కేసులు(Corona Case) ఆందోళన కలిగిస్తున్నాయి. కొత్తగా 142 కేసులు నమోదైనట్లు, కర్నాటకలో(Karnataka) ఒకరు మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ(Union Health Ministry) వెల్లడించింది. యాక్టివ్ కేసుల(Active Cases) సంఖ్య 1,970కి చేరింది. నిన్న కేరళ(Kerala) లో ఐదుగురు, యూపీ(UP) లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో కరోనా మృతుల సంఖ్య ఏడు కు చేరింది. కరోనా వల్ల ఇప్పటి వరకు 5,33,318 మంది మరణించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనా నుంచి 4.44 కోట్ల మంది కోలుకున్నారని, రికవరీ రేటు(Recovery Rate) 98.81 శాతంగా ఉంది. ఒక్క కేరళ లోనే తాజాగా 115 కేసులు నమోదు అయ్యాయని, మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1,749కి చేరిందని ఆరోగ్య శాఖ తెలిపింది. కేరళ పక్కనే ఉన్నకర్ణాటకలో 10 కేసులు నమోదు కాగా, ఒకరు మరణించారు. దేశంలో సోమవారం కొత్తగా 260 కేసులు నమోదు అయినట్లు పేర్కొన్నారు. కాగా కరోనా కేసులు పెరగడంతో రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది.
కొత్త కేసులతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వైద్యశాఖలు అప్రమత్తం అయ్యాయి. కరోనా విస్తరిస్తే చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించి అందుకు అవసరమైన ఏర్పాట్లు చేశాయి
