కరోనా(Corona) పూర్తిగా పోయిందని అనుకుంటున్న నేపథ్యంలో మరోసారి కేసుల(corona Cases) పెరుగుదల చర్చనీయాంశంగా మారింది. చాలా రోజుల తర్వాత మళ్లీ కొవిడ్(Covid) కొత్త కేసులు పెద్ద సంఖ్యలో బయటపడ్డాయి.

166 Corona Cases
కరోనా(Corona) పూర్తిగా పోయిందని అనుకుంటున్న నేపథ్యంలో మరోసారి కేసుల(corona Cases) పెరుగుదల చర్చనీయాంశంగా మారింది. చాలా రోజుల తర్వాత మళ్లీ కొవిడ్(Covid) కొత్త కేసులు పెద్ద సంఖ్యలో బయటపడ్డాయి. 24 గంటల వ్యవధిలో 166 మంది కొత్తగా కొవిడ్ మహమ్మారి బారిన పడ్డారు. ఈ 166 కొత్త కేసులలో అత్యధికంగా కేరళలోనే(Kerala) నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 895 కు చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మొన్నటి వరకు రోజువారీ కరోనా కేసుల సగటు 100 గా ఉంది. చలి కాలం(Winter) కావడంతో ఇన్‌ప్లూయెంజా లాంటి వైరస్‌ల కారణంగా కేసుల సంఖ్య పెరుగుతోందని కేంద్రం చెబుతోంది. ఈ మధ్య కరోనా పాజిటివ్‌తో సిమ్లా ఇందిరాగాంధీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్(Indira gadhi medical collage and hospital) లో ఓ మహిళ మరణించినట్లు ప్రకటించింది. కరోనా తీవ్రత తగ్గినప్పటి నుంచి దేశంలో అతి తక్కువ కరోనా కేసులు జూలైలో నమోదయ్యాయని అధికారులు చెప్పారు. 2023 జూలై 24న కొత్త కరోనా కేసులు కేవలం 24 మాత్రమే నమోదు అయ్యాయని తెలిపారు. మొత్తానికి కరోనా కేసులు పెరగడంపై కేంద్రం అలర్టయ్యింది. జాగ్రత్తలు పాటించాలని డాక్టర్లు సైతం సూచిస్తున్నారు. ఒక్కరోజే ఇంత పెద్ద మొత్తంలో నమోదు కావడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.
