భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు(Corona Positive Cases) గణనీయంగా పెరుగుతున్నాయి. గడచిన 24 గంటలలో 819 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా కర్ణాటకలో(Karnataka) 279 కేసులు నమోదయ్యాయి.

Corona Cases In India
భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు(Corona Positive Cases) గణనీయంగా పెరుగుతున్నాయి. గడచిన 24 గంటలలో 819 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా కర్ణాటకలో(Karnataka) 279 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 61 కేసులు, కేరళలో 54 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 4,049కి చేరింది. గత 24 గంటలలో కరోనా వైరస్ కారణంగా ఆరుగురు చనిపోయారు. 889 మంది కరోనా నుంచి రికవరీ అయ్యారు, JN.1 సబ్ వేరియంట్(Corona JN-1 Sub varient) కారణంగా రోజువారీ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మరోవైపు, దేశవ్యాప్తంగా మరణాలు సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చలికాలం కావడం వల్ల ఈ వైరస్ మరింత వేగంగా విస్తరిస్తోందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇలాంటి సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. రద్దీ ఉన్న ప్రాంతాలకు వెళ్లే సమయాలలో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు.
