కరోనా(Corona) మళ్లీ విజృంభిస్తున్నది. వేగంగా వ్యాప్తి చెందుతూ భయాందోళనలను రేపుతోంది. ఎప్పటికప్పుడు రూపాలు మార్చుకుంటూ మనపై దాడికి దిగుతోంది.
ప్రస్తుతం కరోనా ఉప వేరియంట్ JN.1తో(Corona JN1) విరుచుకుపడుతోంది.

సోమవారం నాటికి దేశ వ్యాప్తంగా యాక్టివ్ కరోనా కేసుల(Corona cases) సంఖ్య నాలుగు వేలు దాటింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం దేశంలో 4,054 యాక్టివ్ కేసులున్నాయి. ఆదివారం నాటికి 3,742 గా ఉన్న యాక్టివ్ కేసులు, సోమవారం నాటికి నాలుగు వేలు దాటాయి. కరోనా కారణంగా గత 24 గంటల్లో కేరళలో ఒకరు మరణించారు. కోవిడ్ సబ్-వేరియంట్ JN.1 మొదటిసారిగా గుర్తించిన కేరళలో ఒక రోజులో అత్యధిక సంఖ్యలో 128 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా కరోనా కారణంగా ఇప్పటి వరకు 5,33,334 మంది చనిపోయారు. గత 24 గంటల్లో కరోనా నుంచి 315 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 4,44,71,860 చేరుకుంది. జాతీయ రికవరీ రేటు 98.81 శాతంగా ఉండగా.. మరణాల రేటు 1.18 శాతంగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది

Updated On 25 Dec 2023 9:17 AM GMT
Ehatv

Ehatv

Next Story